Asianet News TeluguAsianet News Telugu

'ఆర్ ఆర్ ఆర్' టెస్ట్ షూట్.. ఊహించని ట్విస్ట్

రాజమౌళి తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెస్ట్ షూట్ చేస్తానని రంగంలోకి దూకారు. ఇద్దరు డూప్ ఆర్టిస్ట్ లను తీసుకుని ఈ టెస్ట్ షూట్ చేయబోతున్నారు. కేవలం అన్ని విభాగాలు కలిపి 50మందితో రాజమౌళి టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ ను గండిపేటలో పెట్టారట. సోమవారం నుంచి రెండు రోజులు షూటింగ్ కు అంతా సిద్దమైందిట. కానీ ఊహించని ట్విస్ట్ పడిందిట. 

RRR waiting for the permissions to test Shoot
Author
Hyderabad, First Published Jun 17, 2020, 2:24 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. కనపడని కరోనా ఈ సినిమా షూటింగ్‌కు అడ్డం పడింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా సెట్స్‌లో రోజూ వందల మంది పనిచేయాలి. అయితే 50 మందికి మించకూడదని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అయినా సరే రాజమౌళి తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెస్ట్ షూట్ చేస్తానని రంగంలోకి దూకారు. ఇద్దరు డూప్ ఆర్టిస్ట్ లను తీసుకుని ఈ టెస్ట్ షూట్ చేయబోతున్నారు. కేవలం అన్ని విభాగాలు కలిపి 50మందితో రాజమౌళి టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ ను గండిపేటలో పెట్టారట. సోమవారం నుంచి రెండు రోజులు షూటింగ్ కు అంతా సిద్దమైందిట. కానీ ఊహించని ట్విస్ట్ పడిందిట. 

ఈ టెస్ట్ షూట్ కు  ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా ఫర్మిషన్ రాలేదట. దాంతో ఫర్మిషన్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిన పరిస్దితి. మరో ప్రక్క తెలంగాణాలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోవటంతో ప్రభుత్వం ఆ విషయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో ఈ టెస్ట్ షూట్ కు ఎప్పటి నుంచి ఫర్మిషన్ ఇస్తారనేది అందరిలో ఆసక్తికర విషయంగా మారింది. ఇక తక్కువ మందితో ఎలా షూటింగ్ చేయాలి? కరోనా వ్యాప్తి చెందుకుండా నిబంధనలు ఎలా పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి ఈ టెస్ట్ షూట్‌లో పరిశీలిస్తారట. సెట్‌లో పీపీఈ కిట్లు, థర్మామీటర్స్, హ్యాండ్ శానిటైజర్లు, ఇతర సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను రాజమౌళి అండ్ టీమ్ సిద్ధంగా ఉంచిందట.  ఈ షూట్ సక్సెస్ అయ్యితే ఆ సాధక బాధకాలు గమనించి, అప్పుడు తాము ముందుకు అడుగు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. 

మరో ప్రక్క రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి మిగతా సినిమాలు షూటింగ్‌ల‌ు మొదలు కానున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం పరిశ్రమ కోసం రాజమౌళి ఈ ముందడగు వేస్తున్నారు. ఈ షూట్ అయ్యాక తాము సెట్ పై ఎదుర్కొన్న సమస్యలు, ఎలా ఇబ్బందులను అధిగమనించారు వంటివి వీడియో రూపంలో మీడియాకు రిలీజ్ చేస్తారని వినపడుతోంది. దాంతో అందరూ రాజమౌళి వైపే చూస్తున్నారు.   ‘షూటింగ్‌కు   వెళ్లకుండా ఇక ఆగలేను. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సిద్ధమైపోదాం.’  అంటున్నారు దర్శకుడు రాజమౌళి.   `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios