టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR వచ్చే వరకు సినిమాకు సంబందించిన రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడేలా లేదు. ఊహాగానాలు ఎన్ని వచ్చినా కూడా దర్శకుడు రాజమౌళి అయితే క్లారిటీ ఇవ్వడు. అయితే ఇప్పుడు దానికి మెడలో డోలు అన్నట్టు బిగ్ బాస్ 3 తయారయ్యింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే షోకి వ్యాఖ్యాతగా ఉంటానని అధికారికంగా ఒప్పుకోలేదు కానీ స్టార్ మా విన్నపాలకు అనుకూలంగానే ఉన్నట్లు టాక్. 

తారక్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలంటే రిమోట్ జక్కన్న చేతిలో ఉంది. ఆయన నిర్ణయం మీదనే తారక్ డేట్స్ ఆధారపడి ఉన్నాయి. ఏడాదిపాటు సినిమా కోసం బల్క్ డేట్స్ తీసుకున్నాడు. పైగా సినిమా లుక్ కూడా ముందే బయటకు వెళ్లడం రాజమౌళికి ఇష్టం లేదు. మెయిన్ గా డేట్స్ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు శని ఆదివారాల్లో 4 గంటలు తారక్ ఉంటే చాలని అంటున్నారు. 

ఆదివారం ఒకే గాని శనివారం అంటే అసలు కుదరదట. ఎందుకంటే అప్పుడే చాలా మంది ఆర్టిస్ట్ ల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు తారక్ లేకపోతే మళ్ళీ షెడ్యూల్ లో మార్పులు జరుగుతాయి. ఇవన్నీ తలనొప్పులు భరించడం అంటే మళ్ళీ సినిమా మీద ఎఫెక్ట్ పడ్డట్లే. తారక్ అయితే జక్కన్న ఎలా చెబితే అలా అనడం పక్కా. ఇక బిగ్ బాస్ 3 జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే లేనట్లే అన్నట్లు తయారయ్యింది. అభిమానులు ఇప్పటికే ఎన్టీఆర్ వస్తాడని ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ క్లాష్ కి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.    

asianet news special

ANN స్పెషల్: ఇవి కాపీ కథలని మీకు తెలుసా?