ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ ఆ రోజేనట !
ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7 విడుదల చేయనున్నారు. అయితే ఈ క్రమంలో సినిమా మరింత హైప్స్ క్రియేట్ చేయడానికి ఈ నెల 9న మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.
RRR: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ వంటి స్టార్స్ కూడా నటించారు. ఇలా క్రేజీ కాంబోలతో రూపొందుతుంటడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రూ.400 కోట్లకు పై బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేయనున్నారు.
రిలీజ్ తేదీ సమీపిస్తుండటంతో సినీ ప్రమోషన్స్ ను శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందినట్టు తెలుస్తోంది. అలాగే సినిమా వ్యవధి 3 గంటల 6 నిమిషాలని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రోమోస్, సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
అంతా బాగానే ఉన్నా.. అటు మెగా, నందమూరి ఫ్యాన్స్ గానీ.. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారని తెలుస్తోంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ
ఫ్యాన్స్ ఊసురుమనుకున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేస్తునాడని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే కొత్త అప్డేట్ ఇస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.
అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబరు 9న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రానున్నది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. అలాగే.. రామ్ చరణ్- ఎన్టీఆర్ లు కాంబోగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారైనా అనుకున్న టైంకి వచ్చేనా వేచి చూడాలి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. 1920 కాలపు బ్రిటీష్ నేపథ్యంలో సాగే చిత్రమిది. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ కథాంశంతో సినిమాను తెరకెక్కించారు రాజమౌళి.