Asianet News TeluguAsianet News Telugu

జూన్ 25, 26: ఇండస్ట్రీ దృష్టి మొత్తం అటువైపే!

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు.  సినిమాల షూటింగ్ లు ఆపేశారు. పెద్ద ,చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటున్నారు. ముఖ్యంగా భారీగా పెట్టుబడి పెట్టి సగం షూటింగ్ అయిన వారి పరిస్దితే అయోమయంగా మారింది. ఈ నేపధ్యంలో  ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేసుకోమని ఫర్మిషన్ ఇచ్చింది. 

RRR Test Shoot Date Locked
Author
Hyderabad, First Published Jun 22, 2020, 1:51 PM IST

రోజులు, నెలలు గడుస్తున్నా కరోనా తీవ్రత తగ్గటం లేదు. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఎక్కువ డబ్బు రొటేషన్ తిరిగే సినీ పరిశ్రమపై భారీగా పడింది.  ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు.  సినిమాల షూటింగ్ లు ఆపేశారు. పెద్ద ,చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటున్నారు. ముఖ్యంగా భారీగా పెట్టుబడి పెట్టి సగం షూటింగ్ అయిన వారి పరిస్దితే అయోమయంగా మారింది. ఈ నేపధ్యంలో  ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేసుకోమని ఫర్మిషన్ ఇచ్చింది. 

సరే అని ధైర్యం చేద్దామంటే ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. దాంతో  రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే అన్ని రకాల జాగ్రత్తలతో 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ మొదలెట్టాలి అని రాజమౌళి భావించారు. అందుకోసం కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ డూప్ లతో టెస్ట్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా చేస్తూ, ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ, ఆ సంకేతాలు ఇతర నిర్మాతలు, దర్శకులకు పంపించాలని ఆయన భావిస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు జూన్ 25న గండిపేటలో షూట్ ప్రారంభం కానుంది.   రెండు రోజులు పాటు షూటింగ్ జరగనుంది. ఈ టెస్ట్ షూట్ ని ప్రభుత్వం విధించిన అన్ని జాగ్రత్తలతో చేయబోతున్నారు. ఈ టెస్ట్ షూట్ ఏ ఇబ్బంది లేకుండా జరిగితే ఓ నెల రోజులు పాటు లాంగ్ షెడ్యుల్ ని ఈ సెట్ లో జరపాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.  
 
వాస్తవానికి భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా సెట్స్‌లో రోజూ వందల మంది పనిచేయాలి. అయితే 50 మందికి మించకూడదని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.  కేవలం అన్ని విభాగాలు కలిపి 50మందితో రాజమౌళి టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం.  సెట్‌లో పీపీఈ కిట్లు, థర్మామీటర్స్, హ్యాండ్ శానిటైజర్లు, ఇతర సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను రాజమౌళి అండ్ టీమ్ సిద్ధంగా ఉంచిందట.  ఈ షూట్ సక్సెస్ అయ్యితే ఆ సాధక బాధకాలు గమనించి, అప్పుడు తాము ముందుకు అడుగు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. 

మరో ప్రక్క రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి మిగతా సినిమాలు షూటింగ్‌ల‌ు మొదలు కానున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం పరిశ్రమ కోసం రాజమౌళి ఈ ముందడగు వేస్తున్నారు. ఈ షూట్ అయ్యాక తాము సెట్ పై ఎదుర్కొన్న సమస్యలు, ఎలా ఇబ్బందులను అధిగమనించారు వంటివి వీడియో రూపంలో మీడియాకు రిలీజ్ చేస్తారని వినపడుతోంది. దాంతో అందరూ రాజమౌళి వైపే చూస్తున్నారు.   ‘షూటింగ్‌కు   వెళ్లకుండా ఇక ఆగలేను. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సిద్ధమైపోదాం.’  అంటున్నారు దర్శకుడు రాజమౌళి.   `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios