Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌.. స్పెషల్‌ వీడియో.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ?

`ఆర్ ఆర్‌ ఆర్‌` సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని ప్రకటించబోతుంది చిత్ర బృందం. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌ ఈ రోజు మధ్యాహ్నాం ఇవ్వనున్నట్టు తెలిపారు. అనౌన్స్ మెంట్‌ కోసం వెయిట్‌ చేయండి అని రామ్‌చరణ్‌ సైతం తెలిపారు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

rrr team will give biggest announcement today  arj
Author
Hyderabad, First Published Jan 25, 2021, 11:03 AM IST

తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌లో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురంభీమ్‌గా నటిస్తున్నారు. అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మొర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని ప్రకటించబోతుంది చిత్ర బృందం. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌ ఈ రోజు మధ్యాహ్నాం ఇవ్వనున్నట్టు తెలిపారు. అనౌన్స్ మెంట్‌ కోసం వెయిట్‌ చేయండి అని రామ్‌చరణ్‌ సైతం తెలిపారు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిపబ్లిక్‌ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు నటించే పాత్రలకు సంబంధించిన స్పెషల్‌ టీజర్లని విడుదల చేశారు. ఈ సారి ఇద్దరు కలిసి ఉన్న వీడియోని విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం. 

ఇదిలా ఉంటే రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని సినిమా విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ మధ్యలో ఐరీష్‌ నటి చిత్ర విడుదల తేదీ అక్టోబర్‌ 8న అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, ఆ వెంటనే తన తప్పుని తెలుసుకుని డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే అది జనంలోకి వెళ్లిపోయింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రిలీజ్‌ డేట్‌ లీక్‌ కావడంతో తల పట్టుకున్న రాజమౌళి టీమ్‌ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios