ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తుంది. ఇటీవల ఆలియా బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమెని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

త్వరలో రామ్‌చరణ్‌ బర్త్ డే ఉంది. ఈ నెల 27న ఆయన పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి ఎలాంటి గిఫ్ట్ రాబోతుందనే ఉత్కంఠ, ఆసక్తి `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులు, మెగా అభిమానుల్లో నెలకొంది. తాజాగా దాన్ని రివీల్‌చేసింది యూనిట్‌. బర్త్ డే సందర్భంగా భయంకరమైన అల్లూరి సీతారామరాజు లుక్‌ని విడుదల చేస్తామని తెలిపింది. మరి గత బర్త్ డేసందర్భంగా పోలీస్‌ లుక్‌లో,యుద్ధ యోధుడిగా తన శరీరాన్నిమార్చుకుంటున్న వ్యక్తిగా కనిపించారు చరణ్‌. మరి ఇప్పుడు కొత్త పోస్టర్‌లో ఎంత భయంకరంగా చూపిస్తారో చూడాలి. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బర్త్ డే రోజు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా బర్త్ డే సందర్భంగా రానుందట.