‘ఆర్ఆర్ఆర్’ టీం చిత్ర  ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతటా సుడిగాలి పర్యటన చేస్తోంది. నిన్న ఢిల్లీలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించి.. అక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. వీరి నెక్ట్స్ ప్రమోషన్ ఎక్కడన్నదానిపై తాజాగా అప్డేట్ అందింది.

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ RRR. ఈ భారీ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే పాన్ ఇండియన్ మూవీ కావడంతో జక్కన్న చాలా జాగ్రత్తగా, శ్రద్ధ వహిస్తూ ప్రమోషన్స్ కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఇదీ గాక సినిమాపై మరింత ఆసక్తిపెంచేందుకు సమయం దొరికినప్పుడల్లా మీడియా వేదికన చిట్ చాట్ నిర్వహిస్తూనే వస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో రామ్, భీం చిట్ చాట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

అయితే, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో జక్కన్న ఏమాత్రం తగ్గడం లేదు. చాలా ప్లానింగ్ గా.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పర్చుకుంటూ ఈ భారీ చిత్ర ప్రచార కార్యక్రమాలను ఎక్కడా తగ్గకుండా నిర్వహిస్తున్నారు. తొలుత దుబాయ్ లో ప్రమోషన్స్ నిర్వహించి, మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆర్ఆర్ఆర్ టీం.. ప్రస్తుతం దేశమంతటా సుడిగాలిలా తిరుగుతున్నారు. కర్ణాటకలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినప్పటి నుంచి ముగ్గురూ ప్రచారంలోనే బిజీగా ఉన్నారు. సమయం తీరిక లేకుండా సినిమా రీచ్ ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందుకు, కర్ణాటక నుంచి గుజరాత్, అక్కడి నుంచి పంజాబ్, ఆ తర్వాత ఢిల్లీలో నిన్నటి వరకు ప్రచార కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ రోజు రాజస్థాన్ లో ఆర్ఆర్ఆర్ టీం సందడి చేయనుంది. ఇందుకు రాజస్థాన్ లోని జైపూర్ గల లెజెండరీ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ విద్యార్థులతో ఆర్ఆర్ఆర్ విశేషాలను పంచుకోనున్నారు. దేశమంతటా ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆర్ఆర్ఆర్ టీం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తోంది. 

Scroll to load tweet…

ఈ మల్టీస్టారర్ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దేశంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో భాషలో విడుదలవుతోంది. తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఆర్ఆర్ఆర్ 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా, జక్కన్న దర్శకత్వం వహించారు. సీతా రామారాజు పాత్రలో రామ్ చరణ్ (Ram Charan), కొమరం భీం పాత్రలో (NTR) నటించారు.