ఆర్ ఆర్ ఆర్ టీమ్ జోరు మాములుగా లేదు. వరుస అప్డేట్స్ తో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ నటుల బర్త్ డే లను పురస్కరించుకొని వారి లుక్స్ విడుదల చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ బర్త్ డే నాడు ఆమె లుక్ విడుదల చేశారు. చరణ్ పోషిస్తున్న రామరాజు పాత్రకు జంటగా సీత అనే రోల్ అలియా చేస్తుండగా లుక్ విడుదల చేయడం జరిగింది. అలాగే మార్చి 26న చరణ్ బర్త్ డే కానుకగా అల్లూరిగా చరణ్ లుక్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 


ఇక ఏప్రిల్ 2న మరో ఆసక్తికర అప్డేట్ తో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ వచ్చేస్తుంది.  ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. భీమ్, రామరాజులకు మార్గనిర్ధేశం చేసే వ్యక్తిగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తాడని ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. దీనితో ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ పాత్రపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. ఏప్రిల్ 2న అజయ్ దేవ్ గణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన లుక్ విడుదల చేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది . 


ఏప్రిల్ 2న విడుదల కానున్న అజయ్ దేవ్ గణ్ లుక్ చూసిన తరువాత, ఆయన పాత్రపై ఓ ఐడియా వచ్చే సూచనలు కలవు. కాగా అజయ్ దేవ్ గణ్ పాత్రకు జంటగా హీరోయిన్ శ్రీయా నటిస్తున్నారు. ఆమెది తక్కువ నిడివి కలిగిన చిన్న పాత్ర అని తెలుస్తుంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అదే స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిసినెస్ కూడా జరుగుతుంది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.