Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ బర్త్ డే... మంచు మనోజ్ ఏం చేశాడో చూడండి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఈ క్రమంలో చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ హీరో మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారి తీసింది. 
 

rrr star ram charan birthday hero manoj posts an interesting wishes note ksr
Author
First Published Mar 27, 2023, 4:58 PM IST

గత మూడు రోజులుగా మంచు మనోజ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. అన్నయ్య విష్ణుతో విబేధాలున్నాయని తెలిసేలా ఆయన ఓ వీడియో షేర్ చేశారు. ఫేస్ బుక్ స్టేటస్ లో షేర్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.మనోజ్ తండ్రి మోహన్ బాబు... ఆ వీడియో వెంటనే డిలీట్ చేయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే పెద్ద వివాదమైకూర్చుంది.  నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడని మనోజ్ ఆరోపించారు. విష్ణు కోపంగా అరుస్తుండగా పక్కన ఉన్న సిబ్బంది ఆయన్ని సముదాయించడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది . 

మంచు బ్రదర్స్ మధ్య విబేధాలున్నాయన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తుంది. మనోజ్ చర్యతో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ వివాదం మీద మంచు విష్ణు, మంచు లక్ష్మి మాట్లాడారు. ఇది ఫ్యామిలీలో ఏర్పడిన చిన్న డిస్ట్రబెన్స్ మాత్రమే, రాద్ధానం చేయాల్సిన అవసరం లేదు. త్వరలో అన్నీ సర్దుకుంటాయన్నారు. మనోజ్ చిన్నవాడు, ఆవేశంలో చేశాడని వివరణ ఇచ్చారు. నేడు మనోజ్ ఓ మూవీ ఈవెంట్లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. అన్నయ్యతో గొడవేంటని పాత్రికేయులు అడగ్గా... ఆయన సమాధానం దాటవేశారు. 

మంచు బ్రదర్స్ వార్ కొనసాగుతుండగా మనోజ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. నేడు రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో మనోజ్ బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఆయన షేర్ చేసిన పిక్ ఆసక్తిరేపుతోంది. స్వయంగా కేక్ తెచ్చిన మనోజ్ రామ్ చరణ్ చేత కట్ చేయిస్తున్నారు. ఆ పిక్ లో మంచు లక్ష్మిని కూడా చూడొచ్చు. 'స్వీటెస్ట్ బ్రదర్ మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సూపర్ డూపర్ హ్యాపీ బర్త్ డే. నిన్ను చూసి గర్వపడుతున్నా మిత్రమా. నీవు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నా...' అని కామెంట్ పెట్టారు. 

మనోజ్ పోస్ట్ చేసి పిక్ లో కూడా నెటిజెన్స్ పెడార్థాలు వెతుకుతున్నారు. మంచు లక్ష్మితో ఉన్న ఫోటో ప్రత్యేకంగా షేర్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటంటున్నారు. మనోజ్-విష్ణుకు జరుగుతున్న గొడవలో మంచు లక్ష్మి మనోజ్ వైపు ఉన్నారని వినికిడి. అందుకే విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్ వివాహం లక్ష్మి దగ్గరుండి చేసింది. ఫ్యామిలీ గొడవల్లో మనోజ్-లక్ష్మి ఒకవైపు విష్ణు మరొకవైపని ఆ ఫోటో అర్థం అంటున్నారు. ఇక మనోజ్, లక్ష్మి హీరో రామ్ చరణ్ తో దిగిన ఆ ఫోటో మూడేళ్ళ నాటిదని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios