అమెరికా ట్రిప్ లో ఉన్న ఎన్టీఆర్ ఒక రొమాంటిక్ ఫోటో షేర్ చేశారు. భార్య లక్ష్మి ప్రణతిని గుండెలకు హత్తుకుని తన ప్రేమను చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.  

ఎన్టీఆర్(NTR) లాంగ్ వెకేషన్ ప్లాన్ చేశారు. ఆయన ఏకంగా నెల రోజుల పాటు అమెరిలో ఉంటారట. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అమెరికా వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలు అక్కడే జరుపుకోనున్నారని సమాచారం. ఇక అమెరికా ట్రిప్ ని ఎన్టీఆర్ చాలా రొమాంటిక్ గా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఆయన భార్య ప్రణతితో దిగిన ఒక ఫోటో షేర్ చేశారు. ఆమెను గుండెలు హత్తుకుంటూ ప్రేమను కురిపించాడు. ఎన్టీఆర్ ఈ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు లవ్ ఎమోజీలు కామెంట్ గా పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎన్టీఆర్ చాలా అరుదుగా వెకేషన్స్ కి వెళతారు. ఈ విషయంలో మహేష్(Mahesh Babu) టాప్. ఆయన ఏడాదికి ఐదారు ట్రిప్స్ కి వెళతారు. అలాగే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి అసలు పబ్లిక్ అటెన్షన్ కోరుకోరు. సోషల్ మీడియా వాడరు. ఈ రోజుల్లో స్టార్ వైఫ్స్ అంటే ఎలా ఉంటున్నారు. మాకు కూడా ఫేమ్, నేమ్ కావాలని తాపత్రయ పడుతున్నారు. లక్ష్మి ప్రణతి సో సింపుల్. అవేమీ కోరుకోదు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మాత్రమే హాజరవుతుంది. 

View post on Instagram

ఇక ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు కాగా... భార్గవ రామ్, అభయ్ రామ్ పేర్లుగా పెట్టాడు. కాగా ఎన్టీఆర్ 30(NTR 30) త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. షూటింగ్ లో బిజీ కాకముందే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. కొరటాల మూవీ అనంతరం కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి.