టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియన్ మూవీ RRR కోసం రాజమౌళి చాలానే కష్టపడుతున్నాడు. పైగా మొదటిసారి బాహుబలి కంటే హై రేంజ్ లో బడ్జెట్ కేటాయించడంతో కొంత ప్రెజర్ గానే ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని ప్రతి సీన్ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కొమురం బీమ్ - అల్లూరి సీతారామరాజు వంటి పాత్రల్లో కనిపిస్తున్నారంటే ప్రతి సీన్ కూడా ఊహించని విధంగా ఉండాలి. ఇక ఇంటర్వెల్ అయితే అంతకు మించి అన్నట్లు ఉండలి. అభిమానుల కొండంత అంచనాల్ని అందుకోవాలంటే ఎంతైనా ఖర్చు చేయాల్సిందే అనే విధంగా వర్క్ చేస్తున్నారు. 

RRRలో కేవలం ఇంటర్వెల్ సీన్ కోసం 45కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ లో హై విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానం కానున్నాయి. 350కోట్ల బడ్జెట్ రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసమే సగం బడ్జెట్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం సిటీ అవుట్ కర్ట్స్ లో వేసిన ఒక బారి సెట్స్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ముందుగా తారక్ ఆ ఆతరువాత రామ్ చరణ్ కి సంబందించి సీన్స్ ని షూట్ చేయనున్నారు.