మెగా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ బారి బడ్జెట్ సినిమాపై బారి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా హైదరాబద్ లో కొన్ని యాక్షన్ సీన్స్ కోసం షెడ్యూల్ స్టార్ట్ చేశారు. 

ఈ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ బ్రిటిష్ రాజులను ఎదుర్కొనే సన్నివేశాల్ని ఎక్కువగా చిత్రీకరించారట. ప్రతి ఒక్క ఆడియెన్ ని ఈ సీన్స్ ఉద్వేగానికి లోను చేస్తాయని యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇక సీన్ చివరలో రామ్ చరణ్ - తారక్ కలిసి చేసే ఫైట్ కూడా సినిమాలో మరో హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది. 

దానికి తోడు కీరవాణి అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉహలకందని విధంగా ఉంటుందని టాక్. ప్రతి ఒక్క సీన్ లో దర్శకుడు రాజమౌళి ఆడియెన్స్ విజిల్స్ వేయించే విధంగా తెరకెక్కిస్తున్నాడట. సినిమా షూటింగ్ దశలో ఉండగానే సినిమాపై వస్తోన్న రూమర్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరి సినిమా రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.