ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) టైటిల్ తో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో   ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో కనపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. 

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయిపోయింది. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించారు. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూట్ నిలిచిపోయింది. అయితే దాదాపు ఏడు నెలల తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను రీసెంట్ గా  ప్రారంభించిన విషయం తెల్సిందే. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఎక్కువ కాలం ఈ షెడ్యూల్ ఉండదని తెలుస్తోంది.

ఇప్పటికే... ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి రామ్ చరణ్ స్పెషల్ వీడియోను విడుదల చేసిన సంగతి తెల్సిందే.  చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్టీఆర్ స్పెషల్ వీడియోను విడుదల చేయలేకపోయారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.

 దాంతో వారిని కూల్ చేయటం కోసం..ప్రాజెక్టుకు క్రేజ్ తేవటం కోసం..కొమరం భీమ్ పుట్టిన రోజు అయిన అక్టోబర్ 22న భీమ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియో వదులటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ టీజర్ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప వేరే వారి అవసరం లేదట. ఆ షాట్స్ నే తీసినట్లు తెలుస్తోంది. మిగిలనవి ఆల్రెడీ తీసిన షూటింగ్ లోంచి తీసుకుంటారు.  ఇక నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని సమాచారం.