Asianet News TeluguAsianet News Telugu

RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. `ఆర్ఆర్ఆర్‌` సెకండ్‌ సింగిల్‌

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి అదిరిపోయే డాన్స్ నెంబర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతుందీ `యూనిట్‌. `నాటు నాటు ` అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నారు. 

RRR second single naatu naatu song release date fix latest poster viral
Author
Hyderabad, First Published Nov 5, 2021, 9:37 PM IST

ఇండియన్‌ మోస్ట్ ప్రస్టీజియస్‌ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` (RRR Movie)నుంచి మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి మరో ట్రీట్‌ రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటని విడుదల చేయబోతున్నారు. అదిరిపోయే డాన్స్ నెంబర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతుందీ RRR Movie యూనిట్‌. `నాటు నాటు ` అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నారు. RRR Second Singleని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు. 

ఈ నెల 10(నవంబర్ 10)న ఈ హై ఓల్టేజ్‌ డాన్స్ నెంబర్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) డాన్స్‌ మూవ్‌మెంట్‌ ఫోటోని పంచుకుంది. విదేశాల్లో చిత్రీకరించినట్టుగా ఉన్న ఈ పోస్టర్‌ అదరహో అనిపిస్తుంది. ఇద్దరు హీరోలు కలిసి ఈ పాటలో డాన్సు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ హిస్టారికల్‌ మల్టీస్టారర్‌పై నేషనల్‌ వైడ్‌గా భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను ఆకాశమే హద్దుగా మార్చేందుకు ప్లాన్‌ చేశారు రాజమౌళి. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఇటీవల దసరా కానుకగా, దీపావళి కానుకగా గిఫ్ట్ లు పంచుకుని అభిమానులను ఖుషీ చేశారు. దీపావళి కానుకగా విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్‌` గ్లింప్స్ మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. యూట్యూబ్‌ల్‌ ట్రెండ్‌ అవుతుంది. 

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ సరసన అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాని పది ఇండియన్‌ లాంగ్వేజెస్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. 

also read: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ లుక్‌.. చిరు, పవన్‌, బన్నీ, చెర్రీ.. అకిరా కూడా సందడి.. వైరల్‌

Follow Us:
Download App:
  • android
  • ios