ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది అంటే చాలు రూమర్స్ కాకుల కంటే దారుణం. ఊహించని విధంగా అనేక అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. ఇక భారీ ప్రాజెక్టులకు సంబందించిన వార్తల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిత్ర యూనిట్ స్పందించే వరకు ఆగవు. ప్రస్తుతం RRRపైన అదే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈషా రెబ్బ ఈ భారీ మల్టీస్టారర్ లో నటించే అవకాశం దక్కించుకుందని టాక్ వస్తోంది. అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం జక్కన్న టీమ్ ఈ రూమర్స్ కి తెగ నవ్వుకుంటున్నారు. రీసెంట్ గా కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని చాలా కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మెడ్ పోస్టర్స్ లో చాలానే దర్శనమిచ్చాయి. 

అయితే ఫైనల్ గా యాష్ అదే సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడంతో అక్కడితో రూమర్స్ కి చెక్ పడింది. ఇకపోతే ఇప్పుడు ఈషా రెబ్బ సినిమాలో ఎన్టీఆర్ సిస్టర్ అంటూ మళ్ళీ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు డిఫరెంట్ గా మరో టాక్ వస్తుండడం వైరల్ గా మారింది. 

ఇంతవరకు రాజమౌళి టీమ్ కథానాయకులను అలాగే టెక్నీషియన్స్ ని తప్పితే ఇతర నటీనటుల గురించి అధికారికంగా ఎలాంటి విషయాలను బయటపెట్టలేదు. మరి కన్నడ హీరో యాష్ స్పందించినట్లుగానే ఈషా తన వివరణ ఇస్తుందో లేదో చూడాలి.