Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళిది మాస్టర్ మైండ్ అని మళ్లీ ప్రూవైంది గా

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  దాంతో దాదాపు రెండున్నర నెలలుగా షూటింగ్ లు ఆపేసిన సినీ పరిశ్రమ  తిరిగి పనులు  ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. అయితే ఎవరూ అంత ధైర్యం చేసి షూటింగ్ కు రావటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు. కానీ రాజమౌళి అందుకు ఓ మార్గం వెతికారు. అన్ని జాగ్రత్తలతో ట్రైల్ షూట్ చేద్దామని, అది సక్సెస్ అయితే ముందుకు వెళ్దామని ఆయన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.తన టెక్నికల్ టీమ్‌తో కలిసి సోమ, మంగళవారాల్లో ఈ ట్రయల్ షూట్ చేస్తున్నారట రాజమౌళి. 

RRR Ram Charan and NTR Fake Fight!
Author
Hyderabad, First Published Jun 16, 2020, 2:18 PM IST

రాజమౌళి బుర్ర ఐడియాల పుట్ట. సమస్య నుంచి బయిటపడటానికి ఆయన ఆలోచించే విధానం మిగతా వారికి భిన్నంగా ఉంటుంది. అలాగే ఆ క్రమంలో చేసే సాహసం కూడా అద్బుతంగా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి ఓ పెద్ద సాహసం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోయింది. అంత భారీ బడ్జెట్ చిత్రం అలా అర్దాంతరంగా ఎక్కువ రోజులు షూటింగ్ ఆపటానికి లేదు. అందుకే ముఖ్యమంత్రి ని పట్టుకుని ఎట్టకేలకు ఫర్మిషన్ సంపాదించారు. 

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  దాంతో దాదాపు రెండున్నర నెలలుగా షూటింగ్ లు ఆపేసిన సినీ పరిశ్రమ  తిరిగి పనులు  ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. అయితే ఎవరూ అంత ధైర్యం చేసి షూటింగ్ కు రావటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు. కానీ రాజమౌళి అందుకు ఓ మార్గం వెతికారు. అన్ని జాగ్రత్తలతో ట్రైల్ షూట్ చేద్దామని, అది సక్సెస్ అయితే ముందుకు వెళ్దామని ఆయన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.తన టెక్నికల్ టీమ్‌తో కలిసి సోమ, మంగళవారాల్లో ఈ ట్రయల్ షూట్ చేస్తున్నారట రాజమౌళి. 

 అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు సిరిల్ ఆధ్వర్యంలో వేసిన సెట్‌లో సోమవారం ఈ ట్రైల్‌ షూట్‌ను ప్రారంభించారని సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ డూప్‌ల సాయంతో ఈ ట్రయల్ చేస్తున్నారట రాజమౌళి. వీళ్లిద్దరి మధ్యా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ, తక్కువ సిబ్బందితో పనిచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించడానికి రాజమౌళి ఈ షూట్ చేస్తున్నారని అంటున్నారు. సెట్‌లో పీపీఈ కిట్లు, థర్మామీటర్స్, హ్యాండ్ శానిటైజర్లు, ఇతర సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను రాజమౌళి అండ్ టీమ్ సిద్ధంగా ఉంచిందట.  ఈ షూట్ సక్సెస్ అయ్యితే ఆ సాధక బాధకాలు గమనించి, అప్పుడు తాము ముందుకు అడుగు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. 

మరో ప్రక్క రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి మిగతా సినిమాలు షూటింగ్‌ల‌ు మొదలు కానున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం పరిశ్రమ కోసం రాజమౌళి ఈ ముందడగు వేస్తున్నారు. ఈ షూట్ అయ్యాక తాము సెట్ పై ఎదుర్కొన్న సమస్యలు, ఎలా ఇబ్బందులను అధిగమనించారు వంటివి వీడియో రూపంలో మీడియాకు రిలీజ్ చేస్తారని వినపడుతోంది. దాంతో అందరూ రాజమౌళి వైపే చూస్తున్నారు.   ‘షూటింగ్‌కు   వెళ్లకుండా ఇక ఆగలేను. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సిద్ధమైపోదాం.’  అంటున్నారు దర్శకుడు రాజమౌళి.   `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios