Asianet News TeluguAsianet News Telugu

68th Filmfare Awards South 2023: ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అవార్డుల పంట.. ఎన్టీఆర్, చరణ్ లలో బెస్ట్ యాక్టర్ ఎవరు?


2023కి గాను సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డులు ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్, సీతారామం చిత్రాలు అత్యధిక అవార్డులు కొల్లగొట్టాయి. ఉత్తమ నటుడు అవార్డు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కిన నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారో చూద్దాం.. 
 

rrr movie won most 68th filmfare awards south telugu 2023 who is best actor between ntr and charan ksr
Author
First Published Jul 12, 2024, 8:23 AM IST | Last Updated Jul 12, 2024, 8:25 AM IST

68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్, సీతారామం చిత్రాలు అత్యధిక విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుని సత్తా చాటాయి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 2022లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 ప్రకటన జరిగింది. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ వంటి ప్రధాన విభాగాల్లో విజయం సాధించింది. ఉత్తమ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. ఉత్తమ దర్శకుడు అవార్డు రాజమౌళి అందుకోనున్నారు. ఇక ఉత్తమ నటుడు అవార్డు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రానిదే. 

మరి ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరికి దక్కిందో తెలుసా?... ఈ అవార్డు ఇద్దరికీ సంయుక్తంగా ఇచ్చారు. ఉత్తమ నటులుగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంపికయ్యారు. ఆర్ ఆర్ ఆర్ వలె సీతారామం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో హవా సాగించింది. 5 విభాగాల్లో సీతారామం అవార్డులు అందుకుంది. ఉత్తమ నటి అవార్డు మృణాల్ ఠాకూర్ కి దక్కడం విశేషం. దుల్కర్ సల్మాన్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. గత ఏడాది అనివార్య కారణాలతో ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల ప్రకటన జరగలేదు. దాంతో 2022లో విడుదలైన చిత్రాలకు ఈ ఏడాది ప్రకటించారు.  

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ తెలుగు విన్నర్స్- 2023:
 
ఉత్తమ చిత్రం
RRR
 
ఉత్తమ దర్శకుడు
S. S. రాజమౌళి (RRR)
 
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
సీతారామం (హను రాఘవపూడి)
 
 ఉత్తమ నటుడు 
ఎన్.టి.ఆర్. JR (RRR)
రామ్ చరణ్ (RRR)
 
ఉత్తమ నటుడు (క్రిటిక్స్')
దుల్కర్ సల్మాన్ (సీతారామం)
 
ఉత్తమ నటి 
మృణాల్ ఠాకూర్ (సీతారామం)
 
ఉత్తమ నటి (క్రిటిక్స్)
సాయి పల్లవి (విరాట పర్వం)
 
 ఉత్తమ సహాయ నటుడు 
రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
 
ఉత్తమ సహాయ నటి 
నందితా దాస్ (విరాట పర్వం)
 
ఉత్తమ సంగీత ఆల్బమ్
M. M. కీరవాణి (RRR)
 
ఉత్తమ సాహిత్యం
సిరివెన్నెల సీతారామ శాస్త్రి- కానున్న కళ్యాణం (సీతారామం)
 
ఉత్తమ నేపథ్య గాయకుడు 
కాల భైరవ- కొమురం భీముడో (RRR)
 
ఉత్తమ నేపథ్య గాయని 
చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ- సీతారామం)
      
ఉత్తమ కొరియోగ్రఫీ 
ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు- RRR )   
            
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్  
సాబు సిరిల్ (RRR)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios