Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో పురస్కారం.. ఔట్‌స్టాండింగ్‌ ఫారెన్‌ ఫిల్మ్ గా అకాడమీ అవార్డు..

`ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ అంతర్జాతీయంగా సత్తా చాటుతుంది. ఇప్పటికే మూడు అవార్డులు వచ్చాయి. లేటెస్ట్ గా మరో అరుదైన పురస్కారం ఈ చిత్రానికి వరించింది. 

rrr movie won japan acadamy award
Author
First Published Jan 24, 2023, 4:10 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా గురించి ఇండియా కాదు, ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఈ సినిమా గురించిన చర్చ మొదలైంది. రేపటితో ఆ చర్చ మరింత పెరగబోతుంది. నేడు ఆస్కార్‌ నామినేషన్లని ఫైనల్‌ చేయబోతున్నారు. రేపటితో ఆస్కార్‌ బరిలో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఉందా లేదా తెలిసిపోతుంది. దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఆస్కార్‌ కోసం ఈ చిత్రం పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రం అంతర్జాతీయంగా అవార్డులను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. 

`నాటు నాటు` పాటకి ఏకంగా గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతోపాటు `నాటు నాటు` పాటకి, అలాగే ఫారెన్‌ విభాగంలో బెస్ట్ మూవీ లాస్‌ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్‌ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతోపాటు మరో అరుదైన అవార్డు దక్కింది. జపాన్‌ అకాడమీ అవార్డు వరించడం విశేషం. 

46వ జపాన్‌ అకాడమీ అవార్డులో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్ కేటగిరిలో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి పురస్కారం దక్కింది. పోటీలో ఉన్న `అవతార్‌ 2`, `టాప్‌ గన్‌ః మావెరిక్‌` వంటి సినిమాలను దాటి `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఈఅవార్డు దక్కడం విశేషం. గతేడాది చివర్లో ఈ మూవీ జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. డబ్‌ చేసి అక్కడ రిలీజ్‌ చేయగా, ఈ సినిమాకి విశేష ఆదరణ దక్కింది. ఏకంగా నాలుగు లక్షల మంది ఆడియెన్స్ సినిమాని చూశారు.

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. కొమురంభీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా సుమారు రూ.1200కోట్లు వసూలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios