Asianet News TeluguAsianet News Telugu

ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ని వ్యాపారంగా మార్చేసిన రాజమౌళి...!

ఆర్ ఆర్ ఆర్ అధికారిక వ్యాపార సైట్ ని లాంచ్ చేశారు. ఫుల్ల్లీఫిల్మి పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి, ఆర్ ఆర్ ఆర్ లోగోలు, చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ముద్రించి వస్తువులను అమ్మకానికి పెట్టారు.

rrr movie team launches  Official Merchandise avails t shirts and more with rrr logos
Author
Hyderabad, First Published Sep 21, 2021, 11:58 AM IST

రాజమౌళి ఎంటర్టైనింగ్ దర్శకుడే కాదు, గొప్ప మార్కెటింగ్ నిపుణుడు కూడా. తన సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. బాహుబలి సిరీస్ ని ఆయన ప్రేక్షకులలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం. బాహుబలి 2,  వేల కోట్ల వసూళ్ల వెనుక కారణం కూడా ప్రమోషనల్ టెక్నీక్స్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ నెలకొని ఉండగా, దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు టీం. 


ఆర్ ఆర్ ఆర్ అధికారిక వ్యాపార సైట్ ని లాంచ్ చేశారు. ఫుల్ల్లీఫిల్మి పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి, ఆర్ ఆర్ ఆర్ లోగోలు, చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ముద్రించి వస్తువులను అమ్మకానికి పెట్టారు. టి షర్ట్స్, మాస్క్, మగ్స్ వంటి ఫ్యాషన్ వస్తువులను ఆర్ ఆర్ ఆర్ బ్రాండ్ నేమ్స్ తో అమ్మేస్తున్నారు. సదరు వస్తువులకు భారీ ఆదరణ దక్కుతున్నట్లు తెలుస్తుంది. 


వందల కోట్లకు ఆర్ ఆర్ ఆర్ సినిమా హక్కులు అమ్ముకున్న చిత్ర నిర్మాతలు మరో మార్గంలో ఈ సినిమా క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. హీరో దగ్గుబాటి రానా ఆర్ ఆర్ ఆర్ వ్యాపారానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లాంచ్ చేశారు. అధికారిక ట్విట్టర్ వేదికగా ఆయన ఆర్ ఆర్ ఆర్ వ్యాపార వెబ్ సైట్ ప్రారంభించడం జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios