Asianet News TeluguAsianet News Telugu

బిగ్ సర్ ప్రైజ్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేసిన RRR

జక్కన్న రాజమౌళి చెక్కిన మరో వండర్ ఆర్ఆర్ఆర్ చిత్రం. బాహుబలి చిత్రంతో ఇండియన్ మార్కెట్ ని కొల్లగొట్టిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

RRR movie now streaming in Disney Plus Hotstar also
Author
Hyderabad, First Published Jul 26, 2022, 9:50 AM IST

జక్కన్న రాజమౌళి చెక్కిన మరో వండర్ ఆర్ఆర్ఆర్ చిత్రం. బాహుబలి చిత్రంతో ఇండియన్ మార్కెట్ ని కొల్లగొట్టిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి లేటెస్ట్ గా బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్, జీ 5 సంస్థల వద్ద ఉన్నాయి.  ఆర్ఆర్ఆర్ చిత్రం హిందీలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే భారీగా లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇతర భాషల్లో జీ 5లో స్ట్రీమ్ అవుతోంది. కానీ ఊహించని విధంగా నేడు ఆర్ఆర్ఆర్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి కూడా వచ్చేసింది. 

తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం ఇలా సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి హాట్ స్టార్ సంస్థ కూడా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ఉంది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లూరి, కొమరం భీంగా హిస్టారిక్ రోల్స్ లో నటించి మెప్పించారు. బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1100 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios