దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో మల్టీ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కనుంది.
ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేస్తే దాన్ని అద్బుతంగా జనరంజకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.
బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.
ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు.. ప్రముఖ జీ స్టూడియోస్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ హక్కులను రూ.325 కోట్లకు కోనుగోలు చేసింది. ఇంతకు ముందు జీ స్టూడియోస్ జయంతి లాల్ గడ నాన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఈ హక్కులను జీ సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలుస్తోంది.
తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తారక్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకులు సీట్లో కూర్చోలేరంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక భారీ సెట్టింగ్ తో సినిమా మరోలా ఉంటుందని తెలిపాడు తారక్.
ఈ చిత్రంలో హాలీవుడ్.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ నటిస్తున్నారు. కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగడంతో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
