ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న టాలీవుడ్ సినిమా RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సౌత్ లో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ క్రేజ్.. బాలీవుడ్ లో రాజమౌళి పై ఉన్న నమ్మకం.. ఇలా దేశవ్యాప్తంగా సినిమా అమితమైన ఆసక్తిని రేపుతోంది. 

ఇకపోతే సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే కలకత్తా లో మొదలవనుంది. మొన్నటివరకు హైదరాబాద్ నగరంలోనే చిత్ర యూనిట్ స్పీడ్ గా రెండు షెడ్యూల్స్ ని ఫినిష్ చేసింది. ఇక 40 రోజుల వరకు కలకత్తా లో జక్కన్న టీమ్ బిజీగా గడపనుంది. అయితే ఈ షెడ్యూల్ లో మొదట జూనియర్ ఎన్టీఆర్ కు సంబందించిన సీన్స్ ను తెరకెక్కించనున్నారు. 

ఆ తరువాత చరణ్ తారక్ తో కలవనున్నాడు. అప్పుడు ఇద్దరికి సంబందించిన కొన్ని హెవీ యాక్షన్ సీన్స్ ను రాజమౌళి షూట్ చేయనున్నాడు. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక సంగీత దర్శకుడు కీరవాణి కూడా మ్యూజిక్ పనులను మొదలెట్టారు.