రాజమౌళి రూపొందించిన యాక్షన్‌ విజువల్‌ వండర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` కలెక్షన్ల విషయంలో దుమ్మురేపుతుంది. నాలుగు వారాల్లో ఈ సినిమా భారీగా వసూలు చేసింది. తాజాగా లేటెస్ట్ కలెక్షన్లని ప్రకటించింది యూనిట్‌.

`ఆర్‌ఆర్‌ఆర్‌` ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన చిత్రం. ఓవర్సీస్‌లోనూ రికార్డులు తిరగరాసింది. విదేశాల్లో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. సుమారు ఈ చిత్రం ఓవర్సీస్‌లోనే మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. హిందీ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఇక్కడ కూడా మూడు వందల కోట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తాజాగా ఈ చిత్రం నాలుగు వారాల కలెక్షన్లని వెల్లడించింది యూనిట్‌. ప్రపంచ వ్యాప్తంగా ఇది 1100కోట్ల(గ్రాస్‌) కలెక్షన్లని రాబట్టినట్టు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 350కోట్లకుపైగా కలెక్ట్ చేయడం విశేషం. హిందీలో సుమారు రూ.270కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల అంచనా. సౌత్‌లో కన్నడ, తమిళం, మలయాళంలో సుమారు మరో వంద కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. ఏడువందల కోట్లకుపైగా కలెక్షన్లు కేవలం ఇండియాలోనే వచ్చాయి. దీంతో బాహుబలి తర్వాత రెండో స్థానంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` నిలిచింది. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` 1100 కోట్లు గ్రాస్‌ కలెక్షని సాధించినా షేర్‌ మాత్రం ఆరు వందల కోట్లకే పరిమితం కావడం గమనార్హం. 

మొత్తంగా రాజమౌళి మెరుపులు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన విశ్వరూపం, కీరవాణి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఈ చిత్రం ప్రస్తుతం ఐదో వారంలోకి అడుగు పెట్టింది. `కేజీఎఫ్‌ 2` దెబ్బకి `ఆర్‌ఆర్‌ఆర్‌` కలెక్షన్లు పడిపోయాయి. పూర్తిగా డల్‌ అయ్యాయి. అందుకే `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` రిలీజ్‌కి ముందు సుమారు 1000కోట్లు చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్‌` ఆ తర్వాత వంద కోట్లు చేసేందుకు వారం రోజులు పట్టడం విశేషం. ప్రస్తుతానికి `ఆర్‌ఆర్‌ఆర్‌` కలెక్షన్లు క్లోజింగ్‌కి చేరుకున్నాయి. మొత్తంగా మరో 50 నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. `ఆచార్య` తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా క్లోజ్‌ అవుతుంది. 

ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా నటించారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్యా దాదాపు 470కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. భారీగా టికెట్లు రేట్లు పెంచడంతో ఐదు షోల కారణంగా ఈ చిత్రం తొలి వారంలోనే భారీగా వసూళ్లని రాబట్టింది. కాస్త నెగటివ్‌ టాక్‌ వచ్చినా భారీగా కలెక్ట్ చేసింది.