ట్రిపుల్ ఆర్ నుంచి ఒక్కొక్క పాట సందడి చేస్తోంది. సినిమా సూపర్ సక్సెస్ తో ఈమూవీ నుంచి వరుసగా ఫుల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు టీమ్. ఇక ఈరోజు మరో సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్.
ట్రిపుల్ ఆర్ నుంచి ఒక్కొక్క పాట సందడి చేస్తోంది. సినిమా సూపర్ సక్సెస్ తో ఈమూవీ నుంచి వరుసగా ఫుల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు టీమ్. ఇక ఈరోజు మరో సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్.
బాహుబలి తరువాత ఆ రేంజ్ లో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన సినిమా ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 1000 కోట్ల వసూళ్ళు దాటుకుని పరుగులు పెడుతోంది. కెజియఫ్ రిలీజ్ అయిన తరువాత కూడా ట్రిపుల్ ఆర్ కు ఏమాత్రం కలెక్షన్లు తగ్గలేదంటే ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పవచ్చు.
కోట్లు కొల్లగొట్టిన ఈసినిమాకి కీరవాణి సంగీతం అతి పెద్ద బలమని చెప్పాలి. అయన స్వరపరిచిన పాటలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. ఇక ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు వీడియో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రలీజ్ చేశారు టీమ్.

నెత్తురు మరిగితే ఎత్తర జెండా .. సత్తువ ఉరిమితే కొట్టర కొండా పాట సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అటువంటిది ఈరోజు ఈసాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్,చరణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసిన పాట ఇది. స్వాతంత్ర్య సమరయోధులు .. మహావీరుల చిత్రాలను చూపుతూ సాగే ఈ పాట దేశభక్తిని పెంచుతూ ఉత్సాహభరితంగా నడుస్తుంది.
ఎన్టీఆర్ .. చరణ్ లతో కలిసి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఈ పాటలో కాలు కదిపారు. ఈ ముగ్గురు స్టార్ల డాన్స్ కు ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ఇక ఈపాటలో మరో విషేషం ఉంది. ఈ పాటలో రాజమౌళి కనిపించడం మరో విశేషంగా అనిపిస్తుంది. సినిమాలో రోలింగ్ టైటిల్స్ సమయంలో ఈ పాట వస్తుంది. అప్పుడు థియేటర్లో నుంచి బయటికి వచ్చే తొందరలో ఉన్నవారి కోసం అద్భతమైన వీడియో సాంగ్ ను ఎంజాయ్ చేయమని రిలీజ్ చేశారు టీమ్.
