రెండు కరోనా వేవ్‌ల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్ యాక్షన్‌ డ్రామా రిలీజ్‌ డేట్‌ని ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతుందని గత నాలుగైదు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR movie). ఎన్టీఆర్‌(ntr), రామ్‌చరణ్‌(ram charan) హీరోలుగా, రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అలియాభట్‌, ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్‌ ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయ్యింది.

రెండు కరోనా వేవ్‌ల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్ యాక్షన్‌ డ్రామా రిలీజ్‌ డేట్‌ని ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతుందని గత నాలుగైదు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగానే పొంగల్‌ అకేషన్‌ని టార్గెట్‌ చేశారు రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. జనవరి 7న రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. 

`ఇండియన్‌ బిగ్గెస్ట్ యాక్షన్‌ డ్రామా `ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ`ని థియేటర్లో ఎక్స్ పీరియెన్స్ చేయండి` అని పేర్కొంది యూనిట్‌. ఈ మేరకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ ఇద్దరు పోరాటయోధులు యంగ్‌ ఏజ్‌లో కలిసి చేసిన పోరాటం నేపథ్యంలో సాగే చిత్రమిది. 

Scroll to load tweet…