జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ సాధించినట్లే. అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడవ ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది. 


రాజమౌళి లేటెస్ట్ విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్. మార్చ్ 24న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. వరల్డ్ వైడ్ సత్తా చాటిన ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్స్ సెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో భారీగా విడుదల చేశారు. రాజమౌళి గత చిత్రం బాహుబలి 2 జపాన్ లో మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రభాస్ కి అక్కడ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. రికార్డు వసూళ్లతో బాహుబలి 2 రెండో ఇండియన్ మూవీగా నిలిచింది. 

అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహించారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ వెళ్లారు. అక్కడి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ప్రేక్షకులతో మమేకమై సినిమాను పబ్లిక్ లోకి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో గత భారతీయ సినిమాల రికార్డు ఆర్ ఆర్ ఆర్ చెరిపేయడం ఖాయమనుకున్నారు. 

ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కకపోయినా ఆర్ ఆర్ ఆర్ చెప్పుకోదగ్గ వసూళ్లు అందుకుంది. ఇక జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ 17 రోజులు రన్ ముగిసింది. ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ ¥ 185 మిలియన్ వసూళ్లు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ రన్ సాలిడ్ గానే ఉంది. మరి పూర్తి రన్ ముగిసే నాటికి ఎన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి. రజనీకాంత్ ముత్తు ¥ 400 మిలియన్స్ తో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా జపాన్ లో రికార్డు నెలకొల్పింది. బాహుబలి 2 సైతం ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయింది. ఆర్ ఆర్ ఆర్ కి కూడా ముత్తు రికార్డు బ్రేక్ చేయడం కష్టమే అనిపిస్తుంది. 

రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్. నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవ్ గణ్ , శ్రియా, సముద్రఖని కీలక రోల్స్ చేశారు.