టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ RRR పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన ప్రతి న్యూస్ కాలం పరిగెడుతున్న కొద్దీ హీరోలపై మరింత క్రేజ్ ను పెంచుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీలు ఏ విధంగా ఉంటాయి అనే టాక్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. 

అయితే రామ్ చరణ్ ఎంట్రీ కోసం జక్కన్న ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో ఇంకా తెలియరాలేదు గాని జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించగానే థియేటర్ దద్దరిల్లేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం జక్కన్న దాదాపు 22 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. అంటే సగటు స్టార్ హీరో రెమ్యునరేషన్ తో సమానం అని చెప్పవచ్చు.

 తెరపై  కథానాయకుడి పరిచయం కోసం ఇంతవరకు ఎవరు చూపించని విధంగా యాక్షన్ విత్ ఎమోషన్ ను కలగలిపి జక్కన్న తారక్ ను ప్రజెంట్ చేయబోతున్నాడట. ఎంట్రీ కోసం 22 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే మ్యాటర్ డోస్ గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి కొమరం భీమ్ పాత్రలో తారక్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. మొత్తంగా సినిమా కోసం నిర్మాత దానయ్య 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు.