ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు చేయనున్నారనే విషయమై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. పరిణితి చోప్రా,  కైరా అద్వానీ , అలియా భట్ అంటూ బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే  తాజాగా ఇప్పుడీ ఈ వార్తలు హాలీవుడ్ రేంజ్ కు వెళ్లాయి.

ఈ చిత్రం  కథ ప్రకారం ఓ ఫారిన్ గర్ల్ కావాలని తెలుస్తోంది. స్వాతంత్ర్యం కాలం నాటి ఈ కథలో ఎన్టీఆర్ తో ఓ బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడుతుందిట. అప్పటి గవర్నర్ కూతరు ఆమె అని చెప్తున్నారు.  ఆ అమ్మాయి ఎమీ జాక్సన్ లా ఉండాలని రాజమౌళి ఆలోచన అని తెలుస్తోంది.   రామ్ చరణ్ సరసన అలియాభట్ కోసం ప్రయత్నిస్తున్న యూనిట్, ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీని వెదికే పనిలో పడిందట.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే బాహుబలిలా ఈ సినిమాని ఎక్కువ కాలం షూట్ చేయకూడదని, సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం.  

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.