ఒక ప్రక్క ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళికి కొత్త చిక్కొచ్చి పడింది. ఆయన బెదిరింపు కాల్స్ ఎదుర్కొంటున్నారని సమాచారం. ఓ వర్గం ఆయన్ని టార్గెట్ చేయడంతో పాటు అసభ్య పదజాలంతో తిట్టిపోస్తున్నారట.
తనకు అపజయం లేదని రాజమౌళి మరోసారి రుజువు చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)భారీ విజయం వైపుగా దూసుకువెళుతుంది. కేవలం ఐదు రోజుల్లో రూ. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ హిందీలో రూ. 100 కోట్ల మార్కు చేరుకుంది. యూఎస్ లో ఈ చిత్రానికి మరింత ఆదరణ దక్కుతుంది. నార్త్ అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ $ 10 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. యూఎస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుకోగా భారీ మొత్తంలో లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇంత పెద్ద సక్సెస్ అందించినందుకు రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఆర్ ఆర్ ఆర్ చిత్రం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్టీఆర్ చేసిన భీమ్ రోల్ ని రాజమౌళి తీర్చిదిద్దిన విధానం వారికి ఏమాత్రం నచ్చలేదు. రామ్ చరణ్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో వారు జీర్ణించుకోలేకున్నారు. సినిమాలో రామరాజు పాత్రను అద్భుతంగా చూపించిన రాజమౌళి భీమ్ పాత్రను మాత్రం తగ్గించేశారనేది వాళ్ళ నమ్మకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ యుద్ధం హైలెట్ అయ్యింది. భీమ్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది.
రాజమౌళికి ఎన్టీఆర్ (NTR)అత్యంత సన్నిహితుడు కాగా.. పక్షపాతంతో చరణ్ కంటే ఎన్టీఆర్ రోల్ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. ప్రోమోల్లో కూడా ఎన్టీఆర్ ని ఉన్నతంగా చూపించారు. సినిమాలో మాత్రం దానికి పూర్తి విభిన్నంగా ఉంది. నాలుగేళ్లుగా ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు దీనిని జీర్ణించుకోలేకున్నారు. సహనం కోల్పోయిన కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట. బెదిరింపులకు పాల్పడుతున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రచారం అవుతుంది.
కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర తక్కువ చరణ్ పాత్ర ఎక్కువ అనే వాదనలను కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇద్దరు హీరోలు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని అంటున్నారు. ఓ గొప్ప చిత్రాన్ని ఎంజాయ్ చేయాలి, పోలికలు అనవసరం అంటున్నారు. కాగా ఎన్టీఆర్ నిన్న రాజమౌళి (Rajamouli), రామ్ చరణ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిని ఆ లేఖలో ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. లేఖ చివర్లో అభిమానులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
