RRR T-Shirts : ఫ్యాన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ దుస్తులు.. అదిరిపోయే గిఫ్ట్స్ కూడా ఇస్తామంటున్న ఎన్టీఆర్..
అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ట్రీట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ లోగోతో కూడిన దుస్తులను ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించారు. వాటిని ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచారు.
మల్టీస్టారర్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’(RRR) ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో అందరికీ తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్ తో థియేటర్ల వద్ధ ఇంకా ప్రేక్షకుల సందడి నెలకొనే ఉంది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ భారీ చిత్రం అటు బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా ‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషన్స్ పై స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని నెలకొల్పేలా పలు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ భారీ కటౌట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే తారక్, చెర్రీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం ఓ ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికే ప్రమోషన్స్ లో చెప్పిన్నట్టుుగా ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ లోగోతో కూడిన దుస్తులను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. మేకర్స్.. టిషర్ట్స్, షర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులను ‘సోల్డ్ స్టోర్’ (Sold Store) వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ డిజైన్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని తెలుపుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఆర్ఆర్ఆర్ లోగొతో కూడిన టీషర్ట్ ను చూపిస్తూ ఒన నోట్ రాశారు. ‘ఈ దుస్తులు మా అద్భుతమైన అభిమానుల కోసం! ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత అద్భుతంగా ఉందో.. మీరు ఈ దుస్తులను అంతలా ఇష్టపడతారని ఆశిస్తున్నాము. మీరు ఈ అద్భుతమైన RRR డిజైన్‌లను ధరించి మమ్మల్ని సంతోషపెడుతారని భావవిస్తున్నాం. ఇవి ఇప్పుడు ది సోల్డ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులు కొనుగోలు చేసిన ఐదుగురు అదృష్ట విజేతలకు అద్భుతమైన బహుమతుల వోచర్‌లను కూడా అందిస్తాం’ అంటూ వివరించాడు. గతంలో ‘ఇస్మార్ శంకర్’ కాస్ట్యూమ్స్ ను కూడా పూరీ కనెక్ట్స్ ఆధ్వర్యంలో సేల్ చేశారు.