ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలోని ఎత్తర జెండా పాట విడుదలైంది. `ఆర్‌ఆర్‌ఆర్ సెలెబ్రేషన్ ఆంథెమ్` పేరుతో ఈ పాటని రిలీజ్ చేసింది యూనిట్. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది.
రాజమౌళి(Rajamouli) మొదట డిజప్పాయింట్ చేశాడు. తర్వాత ఊరించాడు. తర్వాత సస్పెన్స్ లో పెట్టారు. మొత్తానికి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) సినిమా నుంచి `సెలబ్రేషన్ ఆంథెమ్`(RRR Celebration Anthem) సాంగ్‌ని విడుదల చేశారు. `ఎత్తర జెండా`(Etthara Jenda) అంటూ సాగే పాటని పూర్తి వీడియోని విడుదల చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియాభట్‌లపై ఈ పాటని చిత్రీకరించగా, తాజాగా ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
`నెత్తురు మరిగితే ఎత్తరజెండా` అంటూ సాగే ఈ ఆంథెమ్‌సాంగ్‌లో మన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం విశేషం. ఒక్కో స్వాతంత్య్ర సమరయోధులను ఫోటోలను చూపిస్తూ, వారి ప్రాంతాలను తలచుకుంటూ ఈ పాట సాగింది. వారి ఘనకీర్తిని కొనియాడేలా ఈ పాటని రూపొందించడం విశేషం. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ దోతి కట్టి స్టెప్పులేయగా ఆద్యంతం కనువిందుగా ఉంది. ఒకే స్క్రీన్‌పై ఎన్టీఆర్(NTR), చరణ్(Ram Charan)తోపాటు అలియా కూడా కనిపించడం మరింత అలరిస్తుంది. జానపద నేపథ్యంలో ఈ పాట సాగడం విశేషం.

ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, తెలుగులో ఎంఎం కీరవాణి, హరికా నారాయణ్, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, విష్ మిశ్రా ఆలపించారు. ఈ పాటని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలు చేయబోతున్నారు. ఇక ఈ పాటని ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఈ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివీయా మోర్రీస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించారు. దాదాపు 450కోట్లతో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. పదికిపైగా భాషల్లో ఈ సినిమా మార్చి 25న విడుదల కాబోతుంది.
