టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. ఓపెనింగే బాహుబలి రికార్డును బ్రేక్ చేయగా.. మూడు రోజుల్లో రూ.500 కోట్లు వసూల్ చేసింది.

స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ RRR. ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రూ. 550 కోట్లు వెచ్చించి నిర్మించారు. హై విజువల్స్, యాక్షన్ సిక్వెల్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరూ తమ నటవిశ్వరూపం చూపించారు. వీరిద్దరూ ఉద్యమ వీరులు కొమరం భీం, అల్లూరి సీతారామారాజు పాత్రలు పోషించి ఆడియెన్స్ చేత బ్లాక్ బాస్టర్ అనిపించారు.

ఈ మల్టీస్టారర్ మూవీ మొదిటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలి (Bahubali 2) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన మరో భారీ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. `బాహుబలి`ని మించేలా ఉంటుందనే టాక్‌తో వచ్చిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలిరోజే వరల్డ్ వైడ్‌గా ఇండియన్‌ సినిమా రికార్డ్ లను తిరగరాసింది. తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రూ.223 కోట్ల గ్రాస్ ని కలెక్టర్ చేసిన చిత్రంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. 

మరోవైపు తాజా రిపోర్ట్ ప్రకారం.. ఆర్ఆర్ఆర్ మరో రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి గ్లోబర్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు వసూలు చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ హిస్టరీ క్రియేట్ చేసింది.

Scroll to load tweet…

ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) స్పందిస్తూ.. ‘RRR కొత్త బెంచ్‌ మార్క్‌ను సెట్ చేస్తోంది. మొదటి వీకెండ్ కే రూ. 500 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా GBOC వద్ద కలెక్ట్ చేయడం గొప్ప విషయం. ఇంకా సోమవారపు కలెక్షన్ల రిపోర్ట్ అసాధారణంగా ఉండనున్నాయి. SS రాజమౌళి భారతీయ సినిమా వైభవాన్ని తిరిగి తీసుకువచ్చాడు’అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మండే కలెక్షన్స్ తో కలుపుకుని రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్లను చేరుకునే దిశగా పయనిస్తున్నట్టు తెలుస్తోంది.