ప్రేక్షకులకు గూస్ బంప్స్... బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్!
2022 సౌత్ ఇండియన్ చిత్రాలకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది విడుదలైన మూడు పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ప్రభాస్ రాధే శ్యామ్ నిరాశపరిచినప్పటికీ... ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, విక్రమ్ అలరించాయి. కాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఉన్న చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, విక్రమ్ లను అభివర్ణిస్తున్నారు.
సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా కీలకం. ఇంటర్వెల్ సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ అనుభవం ఇవ్వాలి. అలాగే సెకండాఫ్ లో ఏమి జరగనుందనే ఓ ఆసక్తిరేకెత్తించాలి. అందుకే దర్శకులు ఇంటర్వెల్ బ్యాంగ్ పై బాగా కసరత్తు చేస్తారు. ఇక స్టార్ హీరోల చిత్రాలకైతే భారీ ఎత్తున తెరకెక్కిస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్, విక్రమ్ చిత్రాల ఇంటర్వెల్ బ్యాంగ్స్ అద్భుతమని నెటిజెన్న్ అభిప్రాయపడుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీలో (RRR Movie)ఎన్టీఆర్ అడవి మృగాలతో బ్రిటీష్ సైన్యంపై దాడి చేసే సన్నివేశం థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. అంత పెద్ద కోట, చుట్టూ బ్రిటీష్ సైన్యం.., భీమ్ ఒంటరిగా ఎలా పోరాడుతాడు అనే ఓ క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగేలా చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ (NTR)అడవి మృగాలను ఎందుకు బంధిస్తున్నాడో స్పష్టంగా చెప్పలేదు. తలుపులు బద్దలు కొట్టుకొని వ్యాన్ కోటలోకి తీసుకెళ్లిన ఎన్టీఆర్... అందులో నుండి పులులతో పాటు దూకుతాడని ఎవరూ ఉహించలేదు. అది ప్రేక్షకులకు గొప్ప ఫీలింగ్ కలిగించింది.
అలాగే విక్రమ్ మూవీలో (Vikram Movie)ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించింది. అసలు కమల్ బ్రతికి ఉన్నాడా? లేడా? హత్యలు చేస్తుంది ఎవరు? అనే సస్పెన్సు మైండ్ లో నడుస్తూ ఉండగా... ఇంటర్వెల్ కి ముందు ఓ ఛేజింగ్ సన్నివేశం. మాస్క్ ధరించి ఉన్న కమల్ (Kamal Haasan)ఫైట్, అనంతరం తన మాస్క్ తీసి తనను పరిచయం చేసుకోవడం ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. అనిరుధ్ అద్భుతమైన బీజీఎమ్ తో సాగిన విక్రమ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ కిక్ ఇచ్చింది.
బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్, విక్రమ్ చిత్రాలు ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సన్నివేశాలు అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా విక్రమ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు పూర్తి చేసుకున్న విక్రమ్ రూ. 300 కోట్ల మార్క్ దాటేసింది.