తెలుగు ప్రేక్షకులు దాదాపు ఒక నెల గ్యాప్ లో రెండు అదిరిపోయే యాక్షన్ చిత్రాలను చూశారు - RRR మరియు KGF 2.
రాజమౌళి బాహుబలి,ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాతో భారతీయ చిత్ర సీమను శాసిస్తుంటే.. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ సినిమా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు.అంతకు ముందు ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ అంటూ ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు. కేజీఎఫ్ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా కన్నడతో పాటు తెలుగు హిందీలో ఓ రేంజ్‌లో ఇరగదీసింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 కలెక్షన్స్ అయితే దుమ్ము రేపుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులు దాదాపు ఒక నెల గ్యాప్ లో రెండు అదిరిపోయే యాక్షన్ చిత్రాలను చూశారు - RRR మరియు KGF 2. రెండు సినిమాలకు స్పెషల్ టిక్కెట్ రేట్లు రావడంతో ప్రేక్షకులు భారీ మొత్తాలను వెచ్చించాల్సి వచ్చింది. దీంతో లో,మిడిల్ తరహా బడ్జెట్ సినిమాలు ఇప్పుడు తమ సినిమాలను విడుదల చేయడంపై డౌట్స్ వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఇంత పెద్ద సినిమాలకు అంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రేక్షకులు మళ్ళీ వెంటనే తమపై డబ్బులు వెచ్చిస్తారా అని ఆందోళన చెందుతున్నారు.
అలాగే రాజుని చూసిన కళ్లతో మొగడుని చూసినట్లు..అంత పెద్ద సినిమాలు చూసిన ప్రేక్షకులకు రిలీజ్ కు రెడీగా ఉాన్న చిన్న సినిమాలు (వాటితో పోలిస్తే) ఆనతాయా అనేది ప్రశ్నార్దకమే. ఓ రకంగా ఈ రెండు చిత్రాలు ఇండియన్ భాక్సాఫీస్ పై చూపే ఇంపాక్ట్ నుంచి కోలుకోవటం కష్టమే. ఈ వేడిలో రిలీజైన చిత్రాలు వారం కూడా తిరగకుండానే ఇంటిదారి పట్టాయి.
ఈ క్రమంలో ఏప్రిల్ 22న ప్రకటించిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, నాగశౌర్య కృష్ణ బృందా విహారి సినిమాలు మేకి వాయిదా పడ్డాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం మే 6న విడుదలవుతుందని ప్రకటించారు. ఈ నెలలో ఆచార్య సినిమా మాత్రమే వస్తోంది. ఈ వారం అయితే అసలు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లే లేవు. ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటన్నారు. భాక్సాఫీస్ దగ్గర కాస్తంత ఈ రెండు చిత్రాల ప్రభావం పోయేదాకా ఆగుదామనుకుంటున్నారు.
