యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన తాజా చిత్రం ‘18 పేజెస్’.. ఈ రొమాంటిక్ మూవీలో గ్లామర్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ రొమాంటిక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.

విభిన్న కథలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. తను నటించిన తాజా చిత్రం ‘18 పేజెస్’ 18 Pages. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నిఖిల్ సరసన ఆడిపాడనుంది. రచయిత సుకుమార్ అందించిన లవ్ స్టోరీకి డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీ వాస్ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు చిత్ర షూటింగ్ కూడా కాస్తా ఆసల్యంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేళలకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోంది. దీంతో మేకర్స్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా చిత్రం నుంచి గ్లిమ్స్ విడుదల చేయనున్నట్టు అప్డేట్ అందించారు. ఈ మేరకు తాజాగా రొమాంటిక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. 

18 Pages నుంచి రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. నిఖిల్ తనకు తెలియని ఒక అమ్మాయి ప్రేమలో పడుతాడు. తను చెప్పిన మాటలకు స్ఫూర్తిగా తీసుకొని తనకు సరిజోడిని వెతుక్కునే పనిలో పడతాడు. అయితే ఒక సందర్భంలో ఆ అమ్మాయికి చెందిన డైరీ నిఖిల్ కు దొరుకుతుంది. దీంతో ఆ డైరీ చదువుతూ తనపై ఇంకా ఇష్టం పెంచుకుంటున్నటుగా తెలుస్తోంది. అయితే అసలు ఆ అమ్మాయి మన హీరోకి ఎలా పరిచయం అవుతుంది.. తన డైరీ ఎలా నిఖిల్ చేతికి వస్తుంది.. వీరద్దరూ ఎలా కలవబోతున్నరదే కథాంశంగా తెలుస్తోంది. 

Scroll to load tweet…

గ్లిమ్స్ లో వదిలిన ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు’ లాంటి రొమాంటిక్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ సిద్దు పాత్రలో కనిపించనుండగా.. అనుపమా నందిని పాత్రను పోషిస్తోంది. ఇక నిఖిల్ స్నేహితురాలి పాత్రలో 7ఆర్ట్స్ సరయు నటిస్తోంది. 2020లో సెట్ పైకి వెళ్లిన ఈ చిత్రం ముగింపు దశకు వచ్చింది. ఇప్పటి నుంచి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది. నిఖిల్, అనుపమా కార్తీకేయ 2 (Karthikheya 2) చిత్రంలోనూ నటిస్తున్నారు.