Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ ఆర్మీ ఎటాక్: క్షమించమని చెప్పిన రోల్ రైడా!

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రోల్ రైడాకి ఆ షోతో మంచి గుర్తింపే లభించింది. తెలుగు ర్యాపర్ గా జనాల్లో ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది. 

roll rida 'raadu' song controversy
Author
Hyderabad, First Published Jan 2, 2019, 2:26 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రోల్ రైడాకి ఆ షోతో మంచి గుర్తింపే లభించింది. తెలుగు ర్యాపర్ గా జనాల్లో ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా రోల్ రైడా ''రాదు'' అనే ర్యాప్ సాంగ్ చేశాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో 'రాదు' అనే పదం ఫేమస్ కావడంతో అదే విషయాన్ని తన ర్యాప్ కోసం వాడుకున్నాడు. 

ఈ పాటలో ఎక్కువగా ట్రోల్ విషయాలను ఎన్నుకొని పాట రూపంలో వినిపించాడు. అయితే ఓ చోట ''ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా'' అంటూ లిరిక్ ఉంది. ఇది కౌశల్ ని ఉద్దేశించి పెట్టిన లిరిక్ అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో రోల్ రైడాని టార్గెట్ చేస్తూ.. ఆ వీడియోకి అత్యధిక సంఖ్యలో డిస్ లైకులు కొడుతూనే ఉన్నారు.

దీంతో ఈ విషయంపై స్పందించిన రోల్ రైడా.. కౌశల్ ఆర్మీకి క్షమాపణలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ''నేను కంపోజ్ చేసిన రాదు సాంగ్ కి భారీ వ్యూస్ తో పాటు డిస్ లైకులు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటో కూడా నాకు తెలుసు. ఈ పాటలో నేను ట్రోల్ అయిన విషయాలన్నీ పెట్టుకున్నా.. అలానే 'ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా' అని పెట్టాను.

నిజానికి అది నేను కౌశల్ ఉద్దేశించి చేసిన కామెంట్ కాదు.. కౌశల్ కి డాక్టరేట్, గిన్నిస్ రికార్డ్ ఇస్తామని కొందరు మోసం చేశారు. ఇది వాళ్లకి కౌంటర్. నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. క్షమించండి. కౌశల్ తో నాకు మంచి ర్యాపో ఉంది. ఆయన కారణంగా నాకొక అవార్డు కూడా వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios