సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) హార్ట్ డిసీస్ తో బాధపడుతున్న చిన్నపిల్లలకు అండగా నిలిచాడు. దీంతో ఇటు సినీ ప్రముఖులు, అటు ఫ్యాన్స్, నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసల  వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నటి రోజా సెల్వమణి అభినందనలు తెలిపారు. 

మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీసుకుంటున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున్న ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలకు మహేశ్ బాబు అండగా నిలివడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు దయాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రుల పిల్లల ఆరోగ్యం కోసం పాటుపడుతూ.. తనకున్న సామాజిక స్పృహను చాటుకుంటున్నారు. 

ఇందుకోసం హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న చిన్నారుల కోసం మహేశ్ ఓ చారిటీ సంస్థను స్థాపించారు. మహేష్ బాబు ఫౌండేషన్ (MaheshBabuFoundation) మద్దతును తాజాగా రేయిన్ బో ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (Pure Little Heart Foundation)కు తెలిపారు. ఇప్పటికే మహేశ్ బాబు ఫాండేషన్ ద్వారా వందల మంది చిన్నారులకు అవసరమైన వైద్యం అందించారు. తాజాగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు మద్దతుగా నిలిచి 120 మంది పేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించేందుకు పూర్తి బాధ్యతను తీసుకున్నారు.

అయితే, మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయానికి నగరి ఎమ్మెల్యే, నటి రోజా (Roja Selvamani) హృదయపూర్వకంగా అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా రేయిన్ బో ఆస్పత్రిలో మహేష్ బాబు మీడియాతో ఇంటరాక్ట్ అయిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘చిన్నారుల గుండె చప్పుడు వింటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాట్యాఫ్’ అంటూ అభినందించింది. 1991 నుంచి 2004 వరకు లీడ్ యాక్ట్రెస్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం ప్రజాసేవకు సమయం వెచ్చిస్తున్నారు. మరోవైపు ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’ షోలకు జడ్జీగా ను వ్యవహరిస్తున్నాయి. ఇదే షోలో గతంలో ఓ సందర్భంలో మీరేదైనా కోరిక కోరుకోమని హైపర్‌ ఆది (Hyper Aadi) అనగా, తనకు కృష్ణగారి కొడుకు మహేష్‌ తో కలిసి నటించాలని ఉందంటూ రోజా తన మనస్సులోని మాటను చెప్పుకొచ్చింది. త్వరలో వీరిద్దరూ స్క్రీన్ పై కనిపించే అవకాశాలు కూడా ఉండవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Scroll to load tweet…

అయితే చిన్న పిల్లలకు ఇలాంటి వైద్య సేవలు అందించడానికి మహేష్ పూనుకోవడానికి కారణం ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా మహేష్ వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ ఏడు నెలలకే జన్మించాడు. తనని కాపాడుకోవడానికి ఖరీదైన వైద్యం అందించాల్సి వచ్చింది. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాపాడుకోగలిగాం.. మరి పేదవారి సంగతేమిటి? అనే ఆలోచన కలిగింది. అప్పటి నుండి గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం చేయిస్తున్నాను.. అని తెలిపారు. మొత్తం మీద మహేశ్ బాబు నిర్ణయానికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.