క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో గత కొంతకాలంగా టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి మొదలుపెట్టిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం కాలక్రమంలో సైడ్ ట్రాక్‌లోకి వెళ్లి వ్యక్తిగత ఆరోపణలు, దూషణల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరో జీవిత రాజశేఖర్‌లపై పలు ఆరోపణలు వచ్చాయి.తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇండస్ట్రీలో ఏదీ దాగదు. ఈరోజు కాకపోతే రేపటి రోజైనా ఆ విషయం బయటకు వస్తుంది. హీరో రాజశేఖర్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతుంది. ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు లేవు. నిజంగా ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఇన్ని రోజులు దాగేది కాదు. రాజశేఖర్ ఎలాంటి వారో నాకు తెలుసు. ఆయనతో కలిసి రెండు సినిమాల్లో నటించా. నా భర్తకు మంచి స్నేహితుడు ఆయన. జీవిత లేకుండా రాజశేఖర్ బయటకే వెళ్లరు.. ఎక్కడికి వెళ్లినా భార్య, పిల్లలతోనే కలిసి వెళతారు. 

మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజశేఖర్. అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేశాడంటే అవి కేవలం వాళ్ల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే. ఆయనపై బురదచల్లే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ.. కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు ఆరోపణలు చేసినంత మాత్రాన అది నిజం కాదు. ఆరోపణలు చేసే వాళ్ల ఉద్దేశం ఏమిటో.. ఎందుకు ఇలా చేస్తున్నారో నిజా నిజాలు త్వరలోనే తేలుతాయి అంటూ జీవితా రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు రోజా.