రోజా,బండ్లగణేష్ వర్డ్స్ వార్ నాగబాబు మెడకు చుట్టుకుంటోందా..

రోజా,బండ్లగణేష్ వర్డ్స్ వార్ నాగబాబు మెడకు చుట్టుకుంటోందా..

తెలుగు సినిమా పరిశ్రమలో, ఏపీ రాజకీయాల్లో వారసత్వంపై ఓ  న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చలో వైపాకా ఎమ్మెల్యే, సినీనటి రోజా చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు లేరని, ఆయన తమ్ముళ్లు ఇతర కుటుంబ సభ్యులు కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే.

 

అయితే ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్ల గణేష్‌ రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దాంతో చర్చలో రోజా వ్యాఖ్యలతో బండ్ల విబేధించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం శృతి మించి బూతులు వీరలెవల్లో పండించారు. పళ్లు రాలగొట్టే దగ్గర్నుంచి పక్కలో పడుకోవటం వరకు... అతి జుగుప్సాకరమైన మాటల తూటాలు పేల్చుకున్నారు.

 

కల్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? జగన్ గారిని పవన్ కల్యాణ్ ఏమన్నాడమ్మా? పవన్‌ను గౌరవం లేకుండా వాడూ వీడూ అని మీరు అనొచ్చా? గౌరవం ఇవ్వండి మేడమ్ అని రోజాను ప్రశ్నించారు. దీనిపై రోజా స్పందిస్తూ ఆవేశం తగ్గించుకోవాలని బండ్లకు హితవు పలికారు. అలాగే పాయింట్ మాట్లాడటం నేర్చుకోండని రోజా అన్నారు.దీంతో రెచ్చిపోయిన బండ్ల.. అవును... పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు.. ఒకసారి గెలిచారు.. మీది గోల్డెన్ లెగ్ అని దేశం మొత్తం కోడై కూస్తోంది. ఆ గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉండి, ఆయణ్ని సీఎంను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజశేఖరరెడ్డిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి అని బండ్ల వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.

 

ఈ వార్ టీవీ షో నుండి సోషల్ మీడియాకు పాకి ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇటు పవన్ అభిమానులు, అటు వైసీపీ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఈ వివాదంలో నాగబాబును కూడా లాగారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ను అలా నానా మాటలు అంటుంటే రోజాతో కలిసి జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎందుకు పాల్గొంటున్నారని, రోజా పక్కన కూర్చుని జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనటం పవన్ అభిమానులను కించచపరచటమేనని, వెంటనే ఆ కార్యక్రమం నుంచి నాగబాబు వైదొలగాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos