మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సిద్ధం అవుతోంది. తాజాగా డీఎస్పీ అప్డేట్ ఇచ్చారు. 

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (Valtair Veerayya) సినిమాలో నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తికావచ్చింది. మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. 

మెగా అభిమానులను ఖుషీ చేసేలా దర్శకుడు బాబీ చిరును చూపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, కొన్ని లీక్ లతో మెగాస్టార్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందించారు. చిరంజీవి మాస్ క్రేజ్ కు తగ్గట్టుగానే ఈచిత్రంలోని పాటలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన అప్డేట్ దుమ్ములేచిపోయేలా ఉంది. 

తర్వలోనే ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నామని తెలిపారు. ఫస్ట్ సింగిల్ మాస్ నెంబర్ గా ఉంటుందని తెలిపారు. దీనికి ‘బాస్ పార్టీ’అనే టైటిల్ తో అప్డేట్ అందించారు. ఈ వారంలోనే మాస్ సాంగ్ తో దుమ్ములేపనున్నారని తెలిపారు. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ను దేవీశ్రీ చూశారంట. అదిరిపోయే సాంగ్ కు చిరంజీవి డాన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉందని అన్నారు. దీంతో ఫస్ట్ సింగిల్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. 

ఈ చిత్రంలో మెగాస్టార్ ను బాబీ వింటేజ్ లుక్ లో చూపించబోతుండటంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన చిరు లుక్స్ కూడా అదే సూచిస్తున్నాయి. మాస్ యాంగిల్లో అన్నయ్య కుమ్మేసాడని అంటున్నారు. మూవీలో చిరు సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడింది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Scroll to load tweet…