ఐరన్ మ్యాన్, అవెంజర్స్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన నటుడు రాబర్డ్ డౌనీ జూనియర్. 58 ఏళ్ళ ఈ సీనియర్ హీరో హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరు.
ఐరన్ మ్యాన్, అవెంజర్స్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన నటుడు రాబర్డ్ డౌనీ జూనియర్. 58 ఏళ్ళ ఈ సీనియర్ హీరో హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరు. కానీ ఇంతవరకు రాబర్డ్ డౌనీ ఆస్కార్ అందుకోలేదు. 58 ఏళ్ళ వయసులో డౌనీకి ఆస్కార్ ముచ్చట తీరింది.
క్రిస్టఫర్ నోలెన్ 'ఓపెన్ హైమర్' పుణ్యమా అని డౌనీకి కూడా ఆస్కార్ దక్కింది. ఈ చిత్రంలో రాబర్ట్.. లూయిస్ స్ట్రాస్ పాత్రలో నెగిటివ్ గా అద్భుతంగా నటించాడు. రాబర్ట్ బాడీ లాంగ్వేజ్ స్ట్రాస్ పాత్రకి బాగా సరిపోయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ప్రతిష్టాత్మక డాల్బీ థియేటర్ లో 96వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరిగింది. అంతా ఊహించినట్లుగానే ఓపెన్ హైమర్ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు సాధించి క్లీన్ స్వీప్ చేసేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా కీలక విభాగాలన్నింటిలో ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.

ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీకి అవార్డు దక్కింది. అవార్డు అందుకునే సమయంలో రాబర్ట్ ఎమోషనల్ అయ్యారు. తన బాల్యాన్ని తలుచుకున్నారు.ఓపెన్ హైమర్ చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపాడు. తనకి ఆస్కార్ అవార్డు వస్తుందని క్రిస్టఫర్ నోలెన్ ముందే ఊహించినట్లు రాబర్ట్ తెలిపారు.
తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. తన భార్య సుసాన్ డౌనీ సహకారంతోనే వాటిని అధికమించినట్లు డౌనీ తెలిపారు. ఈ ఆస్కార్ అవార్డుని తన భార్యకి అంకితం ఇస్తున్నట్లు డౌనీ ఎమోషనల్ అయ్యారు. దశాబ్దాల కెరీర్ ఉన్న రాబర్ట్ తొలిసారి ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
