పెను ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్

First Published 12, Jul 2018, 12:12 PM IST
Road accident: Monal Gujjar safe
Highlights

సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన తార మోనాల్‌ గజ్జర్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అహ్మదాబాద్‌ : సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన తార మోనాల్‌ గజ్జర్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మోనాల్‌ తన స్నేహితుడు డాక్టర్‌ రోహిత్‌ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఉదయ్‌పుర్‌ వెళ్లారు. 

వేడుకల తర్వాత తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్‌ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మోనాల్‌ మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. 

దాంతో ఆమె బుధవారం ఫేస్‌ బుక్‌ లైవ్‌కి వచ్చారు. తాను మరణించానని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తనతో పాటూ అందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలిపారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని, అందుకే బెల్ట్‌ ధరించినట్టు తెలిపారు. 

మోనాల్‌  గుజరాతీ చిత్రం రేవాలో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ఫ్యామిలీ సర్కస్‌లో నటిస్తున్నారు. తెలుగుతో పాటూ గుజరాతీ, హింది, తమిళ, మళయాల చిత్రాల్లో మోనాల్‌ నటించారు.

loader