మెగా యువ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య పని ఎక్కువైందని మెగా అన్నదమ్ములిద్దరూ ఓ మంచి ట్రిప్ వేశారు. రామ్ చరణ్ - వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఇచ్చిన సెల్ఫీ ఇప్పుడు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. 

పైగా ఇద్దరు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. కొలంబియాలోని కలి సిటీలో ఇద్దరు సరదాగా గడుపుతున్నట్లు ఫొటోలతో చెప్పేస్తున్నారు. F2 సక్సెస్ తో మార్కెట్ ను మరింత పెంచుకున్న వరుణ్ ఇప్పుడు హరీష్ శంకర్ తో వాల్మీకి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.  ఇక మిస్టర్ సి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.