యాంకర్ లాస్యను వెండితెరకు ఎక్కిస్తున్న ఆర్.కె.స్టూడియోస్ గతంలో గుంటూరు టాకీస్ సినిమాతో రష్మిని వెండితెరపై మెరిపించిన ఆర్.కె,. బేనర్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న రాజా మీరు కేక సినిమా

“గుంటూర్ టాకీస్ “ చిత్రంతో యాంకర్ రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేసిన ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై మరో యాంకర్ లాస్యను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు.

యలమంచలి రేవంత్,నోయెల్,మిర్చి హేమంత్,లాస్య,శోబిత రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం లో నందమూరి తారకరత్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పోసాని కృష్ణ మురళి, పృథ్వి,గుండు సుదర్శన్, కాశివిస్వనాథ్, శివ నారాయణ తదితరులు నటించారు. చక్కటి కథ,కథనం ఉన్న ఈ చిత్రానికి యువ దర్శకుడు కృష్ణ కిషోర్.T దర్శకత్వం వహించారు.

ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన విడుదల అవుతుంది, సెన్సార్ బోర్డు అధికారులు మరియు దగ్గరి సన్నిహితులు ఈ చిత్రాన్ని చూసి అబినంధించారు, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు గారు సినిమాకు అబినందనలు తెలిపారన్నారు.

ఈ చిత్ర నిర్మాత ఏం.రాజ్ కుమార్ మాట్లాడుతూ సినిమా చాల బాగావచ్చిoది, మా మొదటి చిత్రం గుంటూరు టాకీస్ లాగే ఈ సినిమా ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము, దర్శకుడు కృష్ణ కిషోర్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు అన్నిఎమోషన్స్ తో కూడిన చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన విడుదలకు సిద్దంగాఉంది.

 నిర్మాత : రాజ్ కుమార్.M, సహ నిర్మాత: రమేష్ రెడ్డి ఇటికేల, డీఓపీ : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్: జాషువ.