కంటెండర్లు తమ బొమ్మలతో ఉన్న కుండీలను కాకుండా ఇతరుల కుండీలను తీసుకురావాల్సి ఉంటుంది. చివరగా వచ్చినవారు, వారు తెచ్చిన పూల కుండీపై ఎవరిదైతే ఫోటో ఉంటుందో వాళ్లలో ఒకరు మళ్లీ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది.
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ఆట ఇప్పుడిప్పుడే కాస్త రక్తికడుతుంది. మొదట్లో పోల్చితే కాస్త రంజుగా మారుతుంది. బుధ, గురు వారాల్లో హౌజ్‌మేట్స్ ఎమోషనల్‌గా పిండేశారు. ఇక శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ మరింత రంజుగా సాగింది. వచ్చే వారానికి సంబంధించిన కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ `ఆఖరి వరకు ఆగని పరుగు` పేరుతో ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో లోపల ఏర్పాటు చేసిన గదిలో పోటీలో ఉన్న వారి ఫోటోలతో పూల కుండీలుంటాయి.
కంటెండర్లు తమ బొమ్మలతో ఉన్న కుండీలను కాకుండా ఇతరుల కుండీలను తీసుకురావాల్సి ఉంటుంది. చివరగా వచ్చినవారు, వారు తెచ్చిన పూల కుండీపై ఎవరిదైతే ఫోటో ఉంటుందో వాళ్లలో ఒకరు మళ్లీ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. మిగిలిన ఒకరు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఉండాలి, ఎవరు తప్పుకోవాలనేది పోటీలో లేని సభ్యులు తమ అభిప్రాయంతో నిర్ణయిస్తారు. దీనికి ఫైమా సంచాలకులుగా వ్యవహరిస్తారు.
ఈ గేమ్‌లో సూర్య, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్, వసంతి, రేవంత్, అర్జున్ పాల్గొన్నారు. మొదట వసంతి, ఆ తర్వాత ఆదిరెడ్డి, తర్వాత రేవంత్, అలాగే అర్జున్, శ్రీ సత్య ఒక్కో దఫాలో ఒక్కొక్కరు పోటీ నుంచి తప్పుకున్నారు. చివరల్లో సూర్యకి, రోహిత్‌కి మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన సూర్య కెప్టెన్ అయ్యారు. అయితే చివర్లో ఆసక్తకర సంఘటన చోటు చేసుకుంది. చివరి వరకు తన భర్తకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మెరీనా చివర్లో కెప్టెన్సీ కంటెండర్ ఫైనల్‌లో మాత్రం ఆయనకు హ్యాండిచ్చింది. రోహిత్ కంటే సూర్య కెప్టెన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. అది అందరిని షాక్‌కి గురి చేసింది. సూర్య సైతం ఆశ్చర్యపోయాడు.
అదే సమయంలో ఇనయ కూడా వరుసలు కలిపేసుకుంది. చివరల్లో ఎవరికి ఓటు వేయాలి బావకా(సూర్య), బ్రదర్‌కా(రోహిత్) అంటూ చెప్పడంతో అంతా హో ఏసుకున్నారు. ఇది కాసేపు నవ్వులు పూయించింది. చివరగా ఆమె సూర్యకే ఓటు వేసింది. ఏదో వారానికి సంబంధించిన బిగ్ బాస్ హౌజ్‌కి సూర్య కెప్టెన్ అయ్యారు. అంతకు ముందు సూర్య.. తన అమ్మని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే కెప్టెన్సీ పోటీకి వచ్చేసరికి అంతా దూరమైపోతారు, అప్పటి వరకు బాగా ఉంటారని వాపోయింది వాసంతి.
మరోవైపు సపోర్ట్ చేసే విషయంలో ఇనయకి, ఫైమాకి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ పెరగడంతో నీ సపోర్ట్ వద్దు నీవొద్దు అంటూ ఫైమా చెప్పడం విశేషం. మరోవైపు బాలాదిత్య, గీతూ, శ్రీసత్యల మధ్య ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన చర్చలో గీతూపై బాలాదిత్య, శ్రీసత్య హాట్ కామెంట్లు చేశారు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ లో పోరాడే టైమ్‌లో ఆదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్‌గా మారాయి. గతంలో తాను కెప్టెన్సీ చేసి ఫెయిల్ అయ్యానని, తానేమీ పీకలేదని నాగార్జున సర్ అన్నారని, ఈ సారి ఛాన్స్ వస్తే పీకుదామనుకుంటున్నా అని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది.
ఇక ఏదో వారం ముగింపు దశకు చేరుకుంది. రేపు శనివారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ వారంలో బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతూ, సుదీప, శ్రీహాన్, శ్రీసత్య, మెరీనా, కీర్తి, రాజశేఖర్ నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. సుదీప, కీర్తి, రాజశేఖర్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. చివరి వారం చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
