స్టార్ హీరోయిన్ గా సౌత్ లో రాణించిన జెనీలియా ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. జెనీలియా 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా జెనీలియా, రితేష్ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకలని వరదలు ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు వరద ముంపుకు గురై జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోంది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ దంపతులు ముందుకు వచ్చారు. సీఎం సహాయ నిధికి 25 లక్షల విరాళం అందించారు.
సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ని కలసి జెనీలియా, రితేష్ 25 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం వరద బాధితులని ఆదుకునేందుకు విరాళాలు అందిస్తున్నారు.
Thank you Riteish and Genelia Deshmukh for the contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund for #MaharashtraFloods !
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 12, 2019
@Riteishd @geneliad pic.twitter.com/Y6iDng2epD
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 12, 2019, 3:05 PM IST