బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ గత కొంత కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. పలు ఆరోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నట్లు అనేక పుకార్లు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గత ఆరు నెలలుగా రిషి కపూర్ న్యూ యార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

చాలా మంది ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పినప్పటికీ అఫీషియల్ గా కపూర్ ఫ్యామిలీ నుంచి మొన్నటివరకు ఎలాంటి న్యూస్ రాలేదు. దీంతో రకరకాల వార్తలు వచ్చాయి. తల్లి మరణించినప్పుడు కూడా రిషి కనిపించకపోవడంతో అప్పుడే అతని హెల్త్ ఇష్యూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే రీసెంట్ గా రిషి కపూర్ సోదరుడు రణ్ దీర్ కపూర్ ప్రెస్ కు ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన సోదరుడు క్యాన్సర్ చిక్కిత్స తీసుకుంటున్నాడని  త్వరలోనే అతను కోలుకొని ఇండియాలో అడుగుపెడతాడని చెప్పారు.