Asianet News TeluguAsianet News Telugu

కాంతార ప్రీక్వెల్‌లో కలరిపయట్టు ఫైట్, రిషబ్ శెట్టి కొత్త ప్రయోగం

నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారావు ప్రీక్వెల్‌లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఈమూవీలో ఓ యుద్ధ కలను చూపించబోతున్నాడు.

Rishab Shettys Kantara Prequel to Feature Kalaripayattu Fight Sequences JMS
Author
First Published Aug 22, 2024, 5:02 PM IST | Last Updated Aug 22, 2024, 7:02 PM IST

ప్రస్తుతం కన్నడ సినిమాలో స్టార్ గా వెలుగు వెలుగున్నారు రిషబ్ శెట్టి.  కాంతార సినిమా లో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాడు. . కాంతారావులోని నటనకు రెండు  జాతీయ అవార్డును అందుకున్నారు, కాంతారతో  జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. 

ఇక తాను నటించి దర్శకత్వం వహించిన కాంతార  సినిమాలో ఓ అంతరించిపోతున్న జాతి గురించి  కళ్లకు కట్టినట్టు చూపించిన  రిషబ్‌ శెట్టి.. ఇప్పుడు చేయబోయే కాంతార ప్రీక్వెల్  సినిమాలో సరికొత్త ఫైట్‌ ఆర్ట్‌ చూపించనున్నాడు. అవును, చాలా మందికి తెలిసినట్లుగా, రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో కల్రిపయట్టు యుద్ధ కళను చూపిస్తాడని అంటున్నారు. 

ఇంతకీ కలరిపయట్టు అంటే ఏమిటి? 'ది మార్షల్ ఆర్ట్ ఆఫ్ కలరిపయట్టు శతాబ్దాలుగా కేరళలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన శారీరక అభ్యాసం'. ఇది అంతరించిపోతున్న వ్యాయామ కళ.  ఆర్య,ద్రావిడ జాతి ఉపయోగించిన  అతి పురాతనమైనది. ఒకప్పుడు ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉండేదట. రాజులు ప్రత్యేకంగా దీన్ని పెంచి పోషించారని సమాచారం. 

నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారావుకు ప్రీక్వెల్ సినిమాలో ఈ  కలరిపయట్టును చూపించబోతున్నాడు. దీనికి సబంధించిన కలరిపయట్టు ఫైట్‌ను రిషబ్ శెట్టి ఇప్పటికే కేరళలోని ఓ ఎక్స్‌పర్ట్ దగ్గర నేర్చుకున్నాడని అంటున్నారు. ఎంతో కష్టమైనా ఈ కళను.. ఆయన చాలా ఇష్టంగా నేర్చుకన్నాడట. కలరిపయట్టు ఫైట్ ను నేర్చుకునే విధానాన్ని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంతారావు ప్రీక్వెల్ ఇప్పటికే 35% షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios