రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. కాంతారా రికార్డ్స్ ఆగడంలేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన కాంతారా మూవీ.. ఈసారి ఈసినిమా హీరో రిషబ్ శెట్టికి అరుదైన గౌరవాన్ని సాధించింది.
కాంతారా సినిమాతో ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విమర్షకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా కరెషనర్ల పరంగా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఓవర్ ఆల్ గా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇదే కాదు ఆస్కార్ అంచు వరకూ వెళ్లి వచ్చింది కాంతారా. ఇక ఇప్పుడు మరో అరుదైన గైరవాన్ని సాధించింది.
కాంతారా సినిమాకు దర్శకత్వం వహించి, హీరోగా నటించిన రిషభ్ శెట్టి.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. అద్భుత నటన ప్రదర్శించి.. దర్శకత్వంలో టాలెంట్ చూపించిన ఆయన మరో గొప్ప పురస్కారాన్ని అందుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి గెలుచుకున్నాడు. అంతే కాదు ప్రధాని కోసం ఏర్పాటు చేసిన విందులో కూడా రిషబ్ శెట్టి పాల్గొనే అవకాశం కల్పించారు.
రీసెంట్ గా కర్ణాటక పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు పలువురు కన్నడ సినీ ప్రముఖులతో కలసి రిషభ్ హాజరయ్యాడు. విందులో పాల్గొన్న వారిలో యష్, విజయ్ కిరంగదూర్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ తో పాటు కొంత మంది సెలబ్రీటీలు పాల్గోన్నారు. ఇక కాంతార సినిమాకు సీక్వెల్ కూడా ఉంది అని ప్రకటించిన హీరో.. ఆ పని ఇప్పటికే స్టార్ట్ చేశాడు. అయితే కాంతారా సినిమాకు సీక్వెల్ కాదు..ప్రీక్వెల్ ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2024లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
కెజియఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా, కన్నడలో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వడంతోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈమూవీ అటు బాలీవుడ్ తో పాటు.. ఇటు సౌత్ లో అన్ని భాషల్లో ప్రభంజనం సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట సంచలన విజయాన్ని నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.
కన్నడతో పాటు ఇతర భాషల్లోను విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతే కాదు భారీగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. దాదాపు 16కోట్లతో తెరకెక్కిన ఈసినిమా.. దేశవ్యాప్తంగా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. నిర్మాతలకు భారీగా. లాభాలను తెచ్చిపెట్టింది. కర్నాటకలోని ఒక ప్రత్యేక గిరిజన తెగకు సబంధించిన ఆచార వ్యావహారాలు, దైవ సంబంధమైన విశ్వాసం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
