Asianet News TeluguAsianet News Telugu

‘కాంతార’ ఓటిటి రిలీజ్ డేట్ పై నిర్మాత అఫీషియల్ ప్రకటన

 కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం ట్రేడ్ ని ఆశ్చర్య పరిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఇప్పటికి చూడని వాళ్లు, థియేటర్ కు వెళ్లనివాళ్లు, వెళ్లే అవకాసం లేని వాళ్లు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

Rishab Shetty Kantara to release on OTT on Nov 4? Producer reacts
Author
First Published Oct 28, 2022, 7:09 AM IST


 కన్నడ నుంచి వచ్చిన మరో  భారీ హిట్ చిత్రం సినిమా కాంతార. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీతోనే.. జనాల్లోకి దూసుకెళ్లింది.  ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు. తెలుగులో కూడా విడుదలైన కాంతార మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.కేజీఎఫ్ 2′ తరువాత ఆ స్థాయిలో అందరూ మాట్లాడుకునేలా చేసిన సినిమా ‘కాంతార’. అలాగే  కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి నటనకు ఫాన్స్ పెరిగిపోయారు. క్లైమాక్స్ లో రిషిబ్ నటన సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం ట్రేడ్ ని ఆశ్చర్య పరిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఇప్పటికి చూడని వాళ్లు, థియేటర్ కు వెళ్లనివాళ్లు, వెళ్లే అవకాసం లేని వాళ్లు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఆహా లో స్ట్రీమ్ అవుతుందని పుకార్లు కూడా వచ్చేశాయి. దీంతో అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ ఈ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. నవంబర్ 4 న ఓటిటీ లో వస్తున్నది అని వస్తున్న రూమర్స్ లో నిజం లేదని తేల్చి చెప్పాడు.

నిర్మాత కార్తీక్ గౌడ ఈ రూమర్స్ పై స్పందిస్తూ.. కాంతార ఓటిటీ గురించి వస్తున్న వార్తలో నిజం లేదు. ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటిటీలో రాదు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చాడు. దీంతో కాంతారలో ఓటిటిలో చూద్దామని ఎదురుచూస్తున్న  అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.  

కన్నడ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టడం మాత్రమే కాకుండా, బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.అటు హిందీలో కూడా కాంతార సినమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ఆదివారం నాడు 2.65 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీ లో 22.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.  కన్నడ సినిమా కావడంతో.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కంటెంట్ పరంగా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి అగ్నీస్ లోకనాథ్ సంగీతం అందించగా ఒరిజినల్ వెర్షన్ ని హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios